తెలంగాణలో ఇంకా ఎన్నికలకు రెండున్నర సంవత్సరాలు ఉన్నా ఇప్పటికే ఎన్నికల వాతావరణం అనేది నెలకొని ఉందని చెప్పవచ్చు.అయితే ఇప్పటికే టీఆర్ఎస్ ను వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రానివ్వకూడదనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే.
కావున టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా మారాలనే ఉద్దేశ్యంతో టీఆర్ఎస్ తరువాత రెండో ప్రత్యామ్నాయ స్థానం కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పెద్ద ఎత్తున పోటీ పడుతున్న పరిస్థితి ఉంది.
అయితే కెసీఆర్ పై పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందని ఎన్నికల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని ఎన్నికలు వస్తే బీజేపీకి ఓటేయడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని బీజేపీ వ్యాఖ్యానిస్తుండగా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇచ్చిందని కెసీఆర్ పాలనలో పెద్ద ఎత్తున వాళ్ళ ఫ్యామిలీ బాగుపడ్డదని ప్రజలు అష్టకష్టాలు అనుభవిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది.
అయితే ప్రతిపక్షాలు ఎంతగా ప్రచారం చేసినా కెసీఆర్ కుండబద్దలు కొట్టినట్లు వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ 105 స్థానాలు పక్కా వస్తాయని ముచ్చటగా మూడో సారి అధికారం చేపట్టబోతున్నామని చెప్పడంతో ఒక్కసారి ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.అయితే కెసీఆర్ ధీమాగా ఉండటానికి ప్రధాన కారణం ప్రశాంత్ కిషోర్ అనే మాట వాస్తవమే.

అయితే ఇప్పటి వరకు టీఆర్ఎస్ ఓటమికి దారి తీసే విషయాలను కెసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన ప్రశాంత్ కిషోర్ మరల వాటిని పరిష్కరించుకోగలిగితేనే ఎంతో కొంత సానుకూల ఫలితాలు ఉంటాయని చెప్తుండటంతో ఇక వాటిని పరిష్కరించే దిశగా కెసీఆర్ దృష్టి సారించినట్లు తెలుస్తోంద.అందులో భాగంగానే ప్రజల్లో తిరగని ఎమ్మెల్యేలకు ఇప్పటికే వార్నింగ్ ఇచ్చిన కెసీఆర్ పనితీరు మెరుగుపరుచుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించినట్లు పెద్ద ఎత్తున వార్తలు ప్రచారంలో ఉన్న పరిస్థితి ఉంది.







