ఆ ఇద్ద‌రు మంత్రుల విష‌యం జ‌గ‌న్ నిర్ణ‌యం క‌ర‌క్టేనా ?

ఇప్పుడు ఇదే విష‌యం అధికార పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్‌.

 Is Jagans Decision Correct In The Case Of Those Two Ministers ,,ap,ap Political-TeluguStop.com

విజ‌య‌వాడ‌, విశాఖ‌ల విష‌యంలో ఒక నిర్ణ‌యానికి వ‌చ్చార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.జ‌గ‌న్ తీసుకున్న మూడు రాజ‌ధానుల నిర్ణ‌యం వెనుక ఈ రెండు న‌గ‌రాలు కీల‌కంగా మారాయి.

అమ‌రావ‌తిని కేవ‌లం.శాస‌న రాజ‌ధానిగా ఉంచి.విశాఖ‌ను ఎగ్జి‌క్యూటివ్ రాజ‌ధానిగా చేస్తామ‌ని చెప్పారు.అయితే.ప్ర‌జ‌ల నుంచి నేరుగా ఇప్ప‌టి వ‌రకు ఈ నిర్ణ‌యంపై ఎలాంటి అభిప్రాయం వెలువ‌డ‌లేదు.ఇక‌, ఇప్పుడు జ‌రుగుతున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌లు ప్ర‌జ‌ల ఉద్దేశాన్ని వెల్ల‌డించ‌నున్నాయ‌ని వైసీపీ అధినేత భావిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో విజ‌య‌వాడ‌, విశాఖ కార్పొరేష‌న్ల‌లో వైసీపీని గెలిపించి తీరాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.ఈ క్ర‌మంలో ఇక్క‌డి మంత్రులకు బాధ్య‌త‌లు అప్ప‌గించారు.వీరు కాకుండా విజ‌య‌వాడ‌లో పెద్ది రెడ్డి రామ‌చంద్రారెడ్డి.స్థానిక మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్‌, విశాఖ‌లో అవంతి శ్రీనివాస్‌కు దిశానిర్దేశం చేశారు.వీరు నిరంత‌రం.క‌ష్ట‌ప‌డుతున్నారు.అయితే.ఇప్పుడు తాజాగా ఓ ప్ర‌చారం వెలుగులోకి వ‌చ్చింది.

ఏదైనా తేడా వ‌చ్చి.ఈ రెండు చోట్లా కూడా గెలుపు గుర్రం ఎక్క‌క‌పోతే… అక్క‌డ అవంతికి, విజ‌య‌వాడలో వెల్లంప‌ల్లికి ఉద్వాస‌న త‌ప్ప‌ద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఈ మేర‌కు జ‌గ‌న్ కూడా ముందుగానే నిర్ణ‌యం తీసుకున్నార‌ని అంటున్నారు.

Telugu Ap, Latest, Ministers, Peddireddy, Ysrcp-Telugu Political News

మ‌రి ఇది నిజ‌మేనా?  విజ‌య‌వాడ‌, విశాఖ‌ల్లో వైసీపీ ఓడిపోతే.మంత్రుల‌పై వేటు త‌ప్ప‌దా? అంటే… ర‌క‌ర‌కాల చర్చ‌లు కూడా నడుస్తున్నాయి.వైసీపీలోనే కొంద‌రు మాత్రం కేవ‌లం మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో ఓట‌మి సాకుగా చూపించి మాత్ర‌మే వీరిని త‌ప్పించ‌ర‌ని అంటున్నారు.

ఎందుకంటే.మూడు రాజ‌ధానుల  ప్ర‌క‌ట‌న అనేది.

ఈ మంత్రుల‌ను అడిగి జ‌గ‌న్ చేయ‌లేదు.వాస్త‌వానికి మూడు నిర్ణ‌యంలో వారికి ఎలాంటి పాత్ర కూడా లేదు.

ఇది పూర్తిగా జ‌గ‌న్‌.ఆయ‌న కీల‌క స‌ల‌హాదారుల నిర్ణయం.

సో.దీనిని బూచిగా చూపించి మంత్రుల‌పై వేటు వేసే అవ‌కాశం లేదు.

మంత్రుల‌కు బాధ్య‌త‌లు అందించ‌డం వెనుక నేరుగా తాను రంగంలోకి దిగితే బాగుండ‌ద‌నే ఉద్దేశంతోనే న‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే మ‌రో ఐదారు నెల‌ల్లో జ‌రిగే ప్ర‌క్షాళ‌న‌లో రెండున్న‌రేళ్ల‌లో ఓవ‌రాల్‌గా పెర్పామెన్స్ బాగోని మంత్రుల‌ను జ‌గ‌న్ ఖ‌చ్చితంగా తొల‌గిస్తారు.

ఈ లిస్టులోనే పైన చెప్పుకున్న ఇద్ద‌రు మంత్రులు ఉన్నా ఆశ్చ‌ర్య పోవాల్సిన ప‌నిలేదన్న‌ది మాత్రం వాస్త‌వం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube