జగన్ టెన్షన్ పడుతున్నారా ? అందుకేనా ఆ రియాక్షన్ ?

టిడిపి, జనసేన, బిజెపిలు పొత్తు పెట్టుకుని 2024లో ఉమ్మడిగా పోటీ చేయబోతున్నాయి అనే సంకేతాలు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ( CM Jagan )కు కలవరం పుట్టిస్తున్నట్టుగానే కనిపిస్తున్నాయి.అందుకే గత కొద్ది రోజులుగా ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకుని పెద్ద ఎత్తున జగన్ విమర్శలు చేస్తున్నారు.

 Is Jagan Under Tension That's Why The Reaction , Tdp, Chandrababu Naidu, Ysrcp,-TeluguStop.com

ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే వైసిపి గెలుపునకు ఇబ్బందులు ఏర్పడడంతో పాటు, ఆశించినన్ని స్థానాలు దక్కవనే భయము జగన్ లో కనిపిస్తోంది.అందుకే ఎప్పుడూ లేని విధంగా టిడిపి, జనసేన ను టార్గెట్ చేసుకుని జగన్ విమర్శలు చేస్తున్నారు.

గత రెండు రోజులుగా జగన్ పాల్గొంటున్న సభలు, సమావేశాలో ఆయన ప్రసంగాలు వింటే అర్థమవుతుంది.

Telugu Ap, Chandrababu, Jagan, Janasenani, Pavan Kalyan, Pawan Kalyan, Telugudes

మీరంతా ముకుమ్మడిగా తమపై కోటికి వచ్చిన తాము సింగల్ గానే ఎదుర్కొంటాముంటు జగన్ మొదటి నుంచీ  సవాల్ చేస్తూనే వస్తున్నారు.తీరా ఇప్పుడు అదే పరిస్థితి ఎరపడబోతుండడం తో కలవరపాటు కి గురవుతున్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది.టిడిపి మళ్ళీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ప్రజలకు అందవని, ఇప్పుడు అమలు చేస్తున్న పథకాలను రద్దు చేస్తారని జగన్ పదేపదే ప్రస్తావిస్తున్నారు.

ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన ప్రకటనపై జగన్ మరింత ఆందోళన చెందుతున్నారట.

Telugu Ap, Chandrababu, Jagan, Janasenani, Pavan Kalyan, Pawan Kalyan, Telugudes

టిడిపి, జనసేన, బిజెపిల పొత్తు ఖాయం అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మీడియా సమావేశం నిర్వహించి మరి చెప్పిన దగ్గర నుంచి, జగన్ వైఖరిలో మార్పు కనిపిస్తుంది.ఇటీవల కావలిలో జరిగిన సభలోను జగన్ ప్రసంగం ఈ విషయాన్ని తెలియజేస్తుంది.అలాగే నిన్న నిజాంపట్నంలో నిర్వహించిన మత్స్యకార భరోసా నిధుల విడుదల కార్యక్రమంలోనూ జగన్ ప్రసంగం అదేవిధంగా సాగింది.

దత్తపుత్రుడు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu Naidu )లను టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు.గతంలో మాదిరిగా జగన్ హుందా తనంతో వ్యవహరించడం లేదని, వ్యక్తిగత విమర్శలు చేస్తూ పవన్, చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube