మరో మూడు రోజుల్లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( JR NTR ) పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే.తారక్ పుట్టినరోజు సందర్భంగా సింహాద్రి( Simhadri ) మూవీ రీ రిలీజ్ కానుండగా ఈరోజు ఆ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.
సింహాద్రి మూవీ లిమిటెడ్ స్క్రీన్స్ లో రిలీజవుతున్నా ఈ సినిమాకు బుకింగ్స్ కూడా భారీ స్థాయిలోనే ఉన్నాయని సమాచారం అందుతోంది.సింహాద్రి మూవీ రీ రిలీజ్ లో సైతం కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టించడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు( Birthday ) సందర్భంగా స్పెషల్ కామన్ డీపీ విడుదలైంది.ఈ డీపీ అద్భుతంగా ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.గ్లోబల్ హీరోగా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి పర్ఫెక్ట్ డీపీని క్రియేట్ చేశారని ఫ్యాన్స్ చెబుతున్నారు.సింహాద్రి మూవీ రీ రిలీజ్ లో 10 కోట రూపాయల కలెక్షన్లను సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తుండటం సింహాద్రి మూవీకి మరింత ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.భూమిక, అంకిత హీరోయిన్లుగా నటించిన సింహాద్రి మూవీ అప్పట్లో సంచలనాలను సృష్టించగా ఈ సినిమా రీ రిలీజ్ లో సైతం సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు సంబంధించిన షాకింగ్ అప్ డేట్స్ తారక్ పుట్టినరోజు సందర్భంగా రానున్నాయని తెలుస్తోంది.
ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లలో ఎక్కువగా నటిస్తుండగా కొత్త తరం ఫ్యాన్స్ సైతం తారక్ ను ఎంతగానో అభిమానిస్తున్నారు.
గత కొన్నేళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ రేట్ సైతం పెరుగుతోంది.గ్లోబల్ హీరో పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ సినిమా సినిమాకు క్రేజ్ పెరుగుతోంది.జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
.