ఏపీకి పెట్టుబడులు రావడం లేదంటూ గత కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో పాటు , జనసేన, బిజెపి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.మరో వైపు చూస్తే సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయం ఎంతో లేకపోవడంతో, వైసీపీ ప్రభుత్వం కూడా టెన్షన్ పడుతూనే వచ్చింది.
అయితే నిన్న జరిగిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు దిగ్విజయంగా జరిగింది.భారీగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు జరిగాయి.

ఒక్కరోజులోనే 11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయని, రెండో రోజు మరో లక్ష కోట్లు విలువైన ఒప్పందాలు జరగబోతున్నట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.ఈ సదస్సుకు కేంద్రమంత్రి నితిన్ గట్కారి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని నితిన్ గట్కారి కొనియాడారు.ఇప్పటికే జనసేన ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు వ్యవహారంపై తమ పై విమర్శలు చేయమని, ఏపీకి పెట్టుబడి రావాలని తాము కోరుకుంటున్నామని ప్రకటించారు.
ఇది ఇలా ఉంటే కంపెనీలు వారిగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్న వాటి వివరాలను ఒకసారి పరిశీలిస్తే.

ఎన్ టి పి సి ఎంవోయూ 2.35 లక్షల కోట్లు
ఏబిసి లిమిటెడ్ ఎంవోయూ రూ.1.20 లక్షల కోట్లు
రెన్యు పవర్ ఎంవోయూ రూ.97,500
ఇండోసాల్ ఎంవోయూ రూ.76,033
ఏసీఎంఈ ఎంవోయూ రూ.68,976
టీఈపీఎస్ఓఎల్ రూ.65 వేల కోట్లు
Jsw గ్రూప్ రూ.50,632 కోట్లు
హంచ్ వెంచర్స్ రూ.50 వేల కోట్లు
అవాదా గ్రూప్ రూ.50 వేల కోట్లు
గ్రీన్ కో ఎంవోయూ రూ.47,600 కోట్లు
ఓ సీ ఐ ఓ ఆర్ ఎంవోయూ 40 వేల కోట్లు
హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ రూ 30 వేల కోట్లు
వైజాగ్ టెక్ పార్క్ రూ.21,844 కోట్లు
ఆధాని గ్రీన్ ఎనర్జీ రూ.21,820 కోట్లు
ఎకోరిన్ ఎనెర్జి – రూ.15,500 కోట్లు
సెరెంటికా ఎంవోయూ రూ.12,500 కోట్లు
ఎన్ హెచ్ పి సి ఎంవోయూ రూ.12 వేలకోట్లు
అరబిందో గ్రూప్ రూ.10365 కోట్లు
పవర్ ఎంవోయూ రూ.10 వేల కోట్లు
ఏజీపీ సిటీ గ్యాస్ రూ.10 వేల కోట్లు
జే సన్ ఇన్ ఫ్రా ఎం వో యూ రూ.10 వేల కోట్లు
ఆదిత్య బిర్లా గ్రూప్ 9,300 కోట్లు
షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ రూ.8,855 కోట్లు
శ్యామ్ గ్రూప్ రూ.8500 కోట్లు