ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలలు ముందే వైసీపీ)( YCP )లో ఎమ్మెల్యేల రాజకీయ వ్యవహారం సంచలనం కలిగించింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మరియు గాజువాక ఎమ్మెల్యే కుమారుడు తిప్పల దేవన్ రెడ్డి తో పాటు పాటు అనేకమంది ద్వితీయశ్రేణి నాయకులు మున్సిపల్ చైర్మన్లు రాజీనామా చేయడం ఒకసారి గా పార్టీని కుదుపునకు గురి చేసింది.
అయితే ఇది హఠాత్తుగా జరిగిన నిర్ణయం ఏమీ కాదని ముందస్తు వ్యూహం ప్రకారమే ఆయా నేతల పదవులను తొలగించినట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు.సిటింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై గత కొన్ని నెలలుగా సమగ్ర సర్వే రిపోర్టులు తీసుకుంటున్న జగన్ వారి గ్రాఫ్ పెరగకపోవడంతో ఆయా స్థానాలలో ఇన్చార్జిలను మార్చుతున్నారని వచ్చే ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకునే చర్యల లో భాగంగానే నిర్ణయాలు తీసుకున్నారు అని వైసిపి శ్రేణులు చెబుతున్నాయి.

గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వడం కోసమే ఈ నిర్ణయాలని , ఆయా నేతలు పార్టీని వదిలి వెళ్లిపోవడం వల్ల పార్టీకి మంచే తప్ప నష్టం జరగదు అన్నది వీరి వాదన.అయితే వైసీపీ అధిష్టానం పై నమ్మకం లేకే నాయకులు పార్టీని వదిలి పోతున్నారని, ఇది వైసిపి పరాజయానికి నాంది అని తెలుగుదేశం( TDP ) జనసేన శ్రేణులు అంటున్నాయి.ఒకరకంగా జగన్ పై అసమ్మతిని ఇప్పుడు ప్రారంభమైందని దాదాపు 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేలు పార్టీని వదిలి పోవడానికి సిద్ధంగా ఉన్నారన్నది తెలుగుదేశం అనుకూల వర్గాల వాదన.

ఏది ఏమైనా ఇంతకాలం గుంభనం గా ఉన్న వైసీపీలో ఒక కదలిక అయితే వచ్చింది ఇది పార్టీ మంచి కోసం జరుగుతుందా లేక చెడు కోసం జరుగుతుందో తెలియదు గానీ రానున్న కాలంలో కూడా కొన్ని సంచలమైన మార్పులు పార్టీలో జరగబోతున్నట్లుగా తెలుస్తుంది.గత ఎన్నికలలో కూడా పూర్తిస్థాయిలో సర్వేలపై ఆధారపడిన జగన్ ఈసారి కూడా అదే పంధా లో ముందుకు వెళ్తున్నారని, ఎటువంటి మోహమాటలకు బేషజాలకు తావు లేకుండా నిర్ణయాలు తీసుకోబోతున్నారని, చాలాచోట్ల కొత్త ముఖాలకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా టికెట్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది.దాంతో ఇప్పుడు వైసీపీలో టిక్కెట్లు దొరకని నేతలు అప్పుడే వేరువేరు పార్టీలలో ప్రయత్నాలు అప్పుడే మొదలుపెట్టేసారట.