తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్( KCR ) ను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy ) మోసం చేస్తున్నారా అంటే అవుననే చెబుతున్నారు.వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు.
ఏ విషయంలో అంటారా ? దానికి సమాధానంగా ఆయన చెప్పిన మాటలు ఎప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.అసలు విషయంలోకి వెళితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ను డిల్లీ లిక్కర్ స్కామ్ గట్టిగానే ఇబ్బందికి గురి చేస్తోంది.
ఎందుకంటే ఈ కేసులో నిందితురాలిగా ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు ఎదుర్కొంటోంది.ఇదే విధంగా ఏపీలో కూడా వైఎస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy ) హత్య కేసు ముఖ్యమంత్రి జగన్ ను ఇరకాటంలో పడేస్తోంది.

దీంతో ఈ రెండు కేసుల నుంచి తప్పించుకోవడానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.ఇదిలా ఉంచితే డిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి( Director Sarath Chandra Reddy ) ఇటీవల అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే.అయితే ఈ లిక్కర్ స్కామ్ లో కొందరి పేర్లు బయట పెడితే వివేకా హత్య కేసు లో కీలక వ్యక్తి పేరు బయటకు రాకుండా చూస్తామని శరత్ చంద్రారెడ్డితో కొందరు రహస్య మంతనాలు చేసి ఉండొచ్చని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.శరత్ చంద్రరెడ్డి వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడు.

ఈ కారణం చేత వివేకా హత్య కేసులో జగన్ పేరు బయటకు రాకుండా ఉండాలంటే డిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితా పేరు బయటకు చెప్పాలని శరత్ చంద్రారెడ్డితో డిలింగ్ కుదిరి ఉండవచ్చనేది రఘురామ అభిప్రాయంగా తెలుస్తోంది.కాగా శరత్ చంద్ర అప్రూవర్ గా మారడానికి మూడు రోజుల ముందే ఆయన అప్రూవర్ గా మారుతున్నట్లు సాక్షి పత్రికలో కథనం వచ్చిందని కూడా రఘురామ చెప్పుకొచ్చారు.దీన్ని బట్టి చూస్తే శరత్ చంద్రారెడ్డి ప్రణాళిక బద్దంగానే అప్రూవర్ గా మారాడనే వాదన బలపడుతోంది.అయితే శరత్ చంద్రరెడ్డి లిక్కర్ స్కామ్ లో ప్రముఖుల పేర్లు ప్రస్తావిస్తే కేసిఆర్ తీవ్ర తలనొప్పిగా మారే అవకాశం ఉంది.
మొత్తానికి ఈ పరిణామాలను బట్టి చూస్తే వివేకా హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు జగన్.అటువైపు కేసిఆర్ ను ఇరకాటంలో పడేస్తున్నారనేది కొందరి అభిప్రాయం.







