గత కొన్ని సంవత్సరాల నుండి మల్లెమాల ప్రొడక్షన్ లో జబర్దస్త్ షో( Jabardast Show ) ఈటీవీలో ప్రసారమవుతూ ఎంతలా ప్రేక్షకుల ఆదరణ పొందిందో చూశాం.కానీ ఇప్పుడు ఆదరించిన వాళ్ళే ఈ షోపై బాగా విమర్శలు చేస్తున్నారు.
కారణం ఈ షోలో మితిమీరి, హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు కాబట్టి.కమెడియన్స్ వేసే డైలాగులు, పంచులు ఇతరులను కించపరిచే విధంగా ఉన్నాయి.
మామూలుగా మొదట్లో ఈ షో బాగా రన్ అయింది.చాలామంది కమెడియన్స్ ( Jabardast Comedians ) ఈ షో ద్వారానే తమలో ఉన్న టాలెంట్ ను బయటపెట్టారు.
తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.అంతేకాకుండా వెండితెరపై కూడా అవకాశాలు అందుకునే అంత రేంజ్ కు ఎదిగారు.
ఇప్పటికి చాలామంది కమెడియన్స్ వెండితెరపై అవకాశాలు అందుకొని ఓ రేంజ్ లో దూసుకుపోతున్నారు.
ఇక మరి కొంతమంది మాత్రం అలాగే ఉంటున్నారు.
ఇక సంపాదనపరంగా కూడా జబర్దస్త్ నుండి బాగా సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారని చెప్పాలి.ఒకప్పుడు సొంతంగా ఇల్లు లేని వాళ్లు కూడా ఇప్పుడు సొంతంగా ఇల్లు, కార్లు కొనుక్కొని సెటిల్ అయ్యారు.
అలా జబర్దస్త్ పుణ్యానా మంచి హోదాకు చేరుకున్న కమెడియన్స్.రాను రాను మితిమీరి ప్రవర్తిస్తున్నారు.

ఒకప్పుడు ఫ్యామిలీతో కలిసి చూసే ఈ షోను ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి చూడాలంటేనే భయమేస్తుంది.ఎందుకంటే కమెడియన్స్ అలా తయారవుతున్నారు.బాగా డబల్ మీనింగ్ వచ్చే డైలాగులు, శోభనం సీన్స్, బాడీ షేమింగ్స్, ఇతరులను ఉద్దేశించి కామెంట్లు చేయడం ఇలా రకరకాలుగా విమర్శలు ఎదుర్కొంటుంది జబర్దస్త్.
గతంలో ఇటువంటివి ఎదురవటం వల్లే చాలామంది ప్రేక్షకులు ఈ షో పై కేసు వేస్తారు.
ఇక ఆ సమయంలో కాస్త కుదుట పడినట్లు కనిపించారు.కానీ మళ్ళీ అలాగే ప్రవర్తిస్తున్నారు.
దీంతో చూసే జనాలు కూడా ఈ షో పై విరక్తి రావటంతో చూడటమే మానేశారు.కామెడీ అనేది నవ్వే అంతవరకు ఉండాలి కానీ.
హద్దులు మీరే దాకా ఉండకూడదు అంటూ సోషల్ మీడియాలో కూడా జబర్దస్త్ గురించి కామెంట్లు చేస్తూనే ఉన్నారు.

కానీ దీని గురించి జబర్దస్త్ యాజమాన్యం పట్టించుకోవటం లేదని చెప్పాలి.ఇక ఇప్పుడు రేటింగ్ కూడా పూర్తిగా తగ్గిపోయింది.ఒకప్పుడు అనసూయ( Anasuya ) ఉన్నప్పుడు ఈ షో క్రేజ్ బాగానే ఉండేది.
కానీ అందులో వచ్చే బాడీ షేమింగ్స్ పై ఈమె కూడా ఆ షోను వదిలేసింది.ఇక ఆమె స్థానంలో రష్మీ, సౌమ్యరావు ఉన్నప్పటికీ కూడా ప్రేక్షకులను అంతగా మెప్పించడం లేరు.

ఇక కమెడియన్స్ కూడా చాలామంది ఈ షో నుండి బయటకు వెళ్ళిపోతున్నారు.దీంతో చూసే వాళ్లకు కూడా ఈ షో పై ఇంట్రెస్ట్ పూర్తి తగ్గిపోయింది.ఇక రేటింగ్ కూడా పూర్తిగా తగ్గిపోవడంతో మల్లెమాల ఒక నిర్ణయానికి వచ్చిందని తెలిసింది.ఇక జబర్దస్త్ షోని ఆపేయాలని చూస్తుందని తెలిసింది.అయితే దాని ప్లేస్ లో మరో సరికొత్త ప్రోగ్రాంను తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ కొంతమంది అనసూయ వెళ్లాక ఈ షో రేటింగ్ తగ్గిపోయింది అంటూ.
ఇక ఆమెను అవమానించినందుకు ఆమె ఉసురు తగిలింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.