ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికి పోలిటికల్ హిట్ మాత్రం ఎంతకూ తగ్గడం లేదు.వైసీపీ, టీడీపీ, జనసేన ( YCP, TDP, Jana Sena )మద్య రాజకీయ రగడ రాజుకుంటూనే ఉంది.
అయితే వైసీపీ మరియు టీడీపీ జనసేన కూటమి ప్రత్యర్థి పార్టీలుగా ప్రతిబింభించుకుంటున్నా.ఆ మూడు పార్టీలు ఒకే విధానంలో నడుస్తున్నాయనే విమర్శ ప్రస్తుతం ఏపీ పోలిటికల్ సర్కిల్స్ లో ఎక్కువగా వినిపిస్తోంది.
ఏపీ అభివృద్దిలో భాగమైన పోలవరం, కడప స్టీల్ ప్లాన్, విశాఖ రైల్వే జోన్.వంటి వాటిపై ఈ మూడు పార్టీలు కూడా ఒకే వైఖరిని కొనసాగిస్తున్నాయి.
ముఖ్యంగా పోలవరం విషయంలో వైసీపీ ( YCP )సర్కార్ ఎప్పటికప్పుడు మాట మారుస్తూ పూర్తిగా ప్రాజెక్ట్ నే పక్కన పెట్టేసింది.అయితే ప్రాజెక్ట్ విషయంలో టీడీపీ జనసేన పార్టీలు అనుకున్న రీతిలో స్పందించడం లేదనేది కొందరు చేస్తున్న విమర్శ.
ప్రాజెక్ట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదా నిధుల కొరతపై కేంద్రాన్ని నిలదీయడం వంటి చర్యలను టీడీపీ జనసేన పార్టీలు ఏ మాత్రం పాటించడం లేదు.అలాగే ఎన్నో ఏళ్లు పెండింగ్ లో ఉన్న విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాన్( Visakha Railway Zone, Kadapa Steel Plan ).వంటి వాటిపై కూడా పెద్దగా నోరు మెదపడం లేదు.రాష్ట్ర రాజకీయాల విషయంలో ఒక పార్టీపై ఇంకో పార్టీ తీవ్రంగా విమర్శలు చేసుకునే వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు.
రాష్ట్రాభివృద్దికి బాటలువేసే అంశాలను ఎందుకు ప్రస్తావనకు తీసుకురావడం లేదనే చర్చ వాడి వేడిగా జరుగుతోంది.దీన్ని బట్టి ఈ మూడు పార్టీలు కూడా కేంద్రాన్ని తొత్తులుగా ఉన్నాయా అనే సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు కొందరు.
జనసేన పార్టీ బీజేపీతో ఆల్రెడీ పొత్తులో ఉన్న సంగతి విధితమే.
అందువల్ల కేంద్ర ప్రభుత్వ చర్యలను పవన్ ప్రశ్నించే అవకాశం లేదు.ఇక టీడీపీ విషయానికొస్తే బీజేపీతో దోస్తీ కోసం ఆ పార్టీ కూడా తెగ ఆరాటపడుతోంది.అందువల్ల మోడీ( modi ) సర్కార్ ను వేలెత్తి చూపే సాహసం చంద్రబాబు( Chandrababu ) కూడా చేసే అవకాశం లేదనేది కొందరి మాట.ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ విషయానికొస్తే.జగన్ ప్రభుత్వానికి మరియు మోడీ ప్రభుత్వానికి మద్య అంతర్గత పొత్తు ఉందనే టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించే సాహసం జగన్ చేసే అవకాశం లేదు.మొత్తానికి ఏపీలోని మూడు ప్రధాన పార్టీలు కూడా మోడీ సర్కార్ విషయంలో ఒకే విధమైన వైకరి తో ఉండడంతో.
ఇంతకీ ఈ పార్టీలు ప్రజల పక్షమా ? మోడీ పక్షమా ? అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు కొందరు రాజకీయవాదులు.