ప్రస్తుతం ఏపీ రాజకీయాలు( AP Politics ) ఫుల్ కాక మీద ఉన్నాయి.గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తుండడంతో ఏ పార్టీపై చేయి సాధిస్తుందనే చర్చ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఎన్నికలకు ఇంకా చాలానే సమయం ఉన్నప్పటికి ఎప్పటి నుంచే తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు ప్రధాన పార్టీల అధినేతలు.ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ తామే అధికారంలోకి వాలని చూస్తున్న వైఎస్ జగన్.
( YS Jagan ).పార్టీ పరంగా ఈసారి సంచలన నిర్ణయాలు తీసుకొన్నట్లు పోలిటికల్ సర్కిల్స్ లో వినికిడి.ప్రస్తుతం 151 సిట్టింగ్ ఎమ్మేల్యేలు ఉన్న వైసీపీ.వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలను కైవసం చేసుకోవాలని టార్గెట్ పెట్టుకుంది.

ఆ టార్గెట్ రిచ్ కావాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదనే భావనలో జగన్ ఉన్నారట.అందులో భాగంగానే ఈసారి చాలమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ల విషయంలో నో ఛాన్స్ అంటున్నారట.ఇప్పటికే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో ఎమ్మెల్యేల పని తీరుపై అరా తీసిన జగన్ 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.వారందరిని నిర్మొహమాటంగా పక్కన పెట్టి వారి స్థానంలో కొత్త వారికి ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట.
అలాగే మరో సంచలన నిర్ణయం కూడా జగన్ తీసుకొనున్నట్లు పోలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.

వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల విషయంలో 80 శాతం వరకు యాబై ఏళ్ల లోపు వారినే బరిలో నిలిపే ఆలోచనలో ఉన్నారని టాక్.ఇదే గనుక జరిగితే బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, ధర్మాన, అవంతి, వంటి వారికి ఎమ్మెల్యే టికెట్లు దక్కడం కష్టమే.అయితే వారికి ఎంపీ టికెట్లు కేటాయించే అవకాశం లేకపోలేదు.
యాబై ఏళ్ల లోపు ఉన్నవారిని బరిలోకి దించడం వల్ల.పార్టీ క్యాడర్ లో మరింత జోష్ పెరుగుతుందని జగన్ భావిస్తున్నారట.
మరి జగన్ ఒకవేళ ఈ నిర్ణయాలు నిజంగానే అమలు చేస్తే వైసీపీలో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.అలాగే ఆయా అసంతృప్త జ్వాలలు రేకెత్తే అవకాశం కూడా లేకపోలేదు.
మరి వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న సిఎం జగన్.ఎలాంటి ప్రణాళికలతో ముందుకు సాగుతారో చూడాలి.







