కడప లో షర్మిలకు అంత ఈజీ కాదా ?

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల( Sharmila ) రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తారని అంత భావించగా, ఆమె మాత్రం కడప ఎంపీగా పోటీ చేసేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.ఇప్పటికే ఈ విషయాన్ని ప్రకటించారు షర్మిల.

 Is It Not So Easy For Sharmila In Kadapa, Ys Rajashekarareddy, Ys Jagan, Ys Shar-TeluguStop.com

ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు షర్మిలను కడప నుంచి ఎంపీగా పోటీ చేయాలని సూచించారు.ఈరోజు కాంగ్రెస్ ఏపీ అభ్యర్థుల జాబితా విడుదల కానుంది.

ఈ జాబితాలో అధికారికంగా షర్మిల పేరును కడప ఎంపీ అభ్యర్థిగా ప్రకటించనున్నారు.కడపలో వైసిపి అభ్యర్థిగా ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ, తన సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి( YS Avinash Reddy ) ఉన్నారు.

దీంతో షర్మిల అవినాష్ రెడ్డి పై పోటీ చేసి గెలవాల్సి ఉంది.అయితే కడప లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల పోటీ చేసి గెలుపొందడం అంత ఆషామాషీ వ్యవహారం కాదనే విషయం స్పష్టం అవుతుంది.

ఆమె.కాంగ్రెస్ నుంచి పోటీ చేయడమే ఆమెకు పెద్ద ఇబ్బందిగా మారబోతోంది.ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రమే అన్నట్టుగా ఉంది.

Telugu Ap Congress, Ap, Kadapa, Kadapa Mp, Ys Jagan, Ys Rajashekara, Ys Sharmila

వైసీపీ ప్రభావం ఎక్కువగా కనిపించే కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి షర్మిల పోటీ చేసినా విజయావకాశాలు అంతంత మాత్రంగానే ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.అవినాష్ రెడ్డి పై కొన్ని ఆరోపణలు ఉన్నా, ఆయన విజయ అవకాశాలకు డోకా ఉండదని ,షర్మిల కాంగ్రెస్ నుంచి పోటీ చేయడమే ఆమెకు మైనస్ గా మారిపోతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Telugu Ap Congress, Ap, Kadapa, Kadapa Mp, Ys Jagan, Ys Rajashekara, Ys Sharmila

వైస్ రాజశేఖర్ రెడ్డి( YS Rajasekhara Reddy ) కుమార్తెగా షర్మిలకు జనాల్లో సానుకూలత ఉన్నా.ఈ మధ్యకాలంలో జగన్ ను టార్గెట్ చేసుకొని షర్మిల విమర్శలు చేయడం, తన సొంత సోదరుడైన జగన్ ను రాజకీయంగాను, వ్యక్తిగతంగాను విమర్శలు చేయడం వంటివన్నీ షర్మిల ఇమేజ్ ను బాగా డామేజ్ చేస్తాయని, అలాగే వైస్ రాజశేఖరరెడ్డి అభిమానుల్లో షర్మిలపై ఉన్న సానుభూతి గతంతో పోలిస్తే బాగా తగ్గే పరిస్థితి కనిపిస్తోంది.ఇవన్నీ షర్మిల కు రాబోయే ఎన్నికల్లో ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube