కాంగ్రెస్ లో చేరితే టికెట్లు కష్టమేనా.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏమన్నారంటే..?

కాంగ్రెస్ ( Congress ) ఈ దేశాన్ని అత్యధిక సంవత్సరాలు పాలించిన ఏకైక పార్టీ.

దేశంలో ఎన్నో ప్రజా సంస్కరణలు తీసుకువచ్చి , అద్భుతమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టి దేశాన్ని అభివృద్ధి వైపు మలపడంలో ప్రధాన పాత్ర పోషించింది.

అలాంటి కాంగ్రెస్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చతికిల పడిపోయింది.దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ నాయకులే ( Congress leaders ) అని చెప్పవచ్చు.

ఎవరి కంట్లో వారు పోడుచుకుంటారు అనే సామెతకు కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ గా సూట్ అవుతుంది.గల్లి నుంచి ఢిల్లీ వరకు ఈ పార్టీని నాశనం చేసుకునేది ఆ పార్టీలోని నాయకులే.

నాయకుల మధ్య సఖ్యత కుదరక ఎప్పుడు గొడవలు పడుతూ ప్రజల్లో కాస్త చులకన అవుతున్నారు.దీనివల్ల పార్టీ రోజు రోజుకు దిగజారి పోతోంది.

Advertisement

ప్రస్తుతం అలాంటి పరిస్థితి తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో కూడా కనిపిస్తోంది.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ పెరిగినా కానీ, ప్రజలు నమ్మే విధంగా నాయకులు వ్యవహరించడం లేదు.

నమ్మకం కలిగించడం లేదు.ఒకరు తానా అంటే మరొకరు తందానా అంటారు.

అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( Revanth reddy ) ఒకటి తలిస్తే, సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోటి తలుస్తారు, జగ్గారెడ్డి ఇంకోటి అంటారు.

ఇలా నాయకుల మధ్య ఎప్పుడు ఏదో ఒక వార్ జరుగుతూనే ఉంటుంది.కట్ చేస్తే రాబోవు ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ ( BRS ) ను దెబ్బ కొట్టేది కాంగ్రెస్ అనే విధంగా తయారయింది.దీంతో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రకరకాల సభలు పెట్టి ఢిల్లీ పెద్దలను పిలిపించి కాంగ్రెస్ లో ఎంతో మంది నాయకులను చేర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?

ఈనెల 17న తుక్కుగూడ ( Thukkuguda ) లో జరిగే సభలో కాంగ్రెస్ లోకి ఇతర పార్టీల నుంచి పెద్దపెద్ద లీడర్లు చేరుతారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది.ఇదే తరుణంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( Komatireddy Venkata reddy ) వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Advertisement

కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఉండబోతున్నాయా అంటూ ఒక విలేకరి ప్రశ్నించగా.ఇప్పటికే కాంగ్రెస్ లో చాలామంది నాయకులు ఉన్నారు.ఆ నాయకులకి టికెట్ల సర్దుబాటులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఇక కొత్త నాయకులను ఎక్కడి నుంచి తీసుకోవాలి.కారు పార్టీలో ఖాళీగా ఉంది అందులోకి వెళ్ళండని, కాంగ్రెస్ ( Congress ) లోకి రావద్దని చెప్పగానే చెప్పేశారు.

ఆయన మాట్లాడిన మాటలు చూస్తే మాత్రం కాంగ్రెస్ లో చేరాలనుకునే వారిని ఆలోచనలో పడేసిందని చెప్పవచ్చు.

తాజా వార్తలు