చంద్రబాబు కి నరేంద్ర మోడీ అగ్ర తాంబూలం

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ వైపు వడివడిగా అడుగులేస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో బిజేపీతో టిడిపి పొత్తు తప్పదా? బిజేపీ అగ్ర నేతలు సైతం బాబుకు అనుకూలంగానే ఉన్నారా? అంటే అవుననే అనిపిస్తున్నాయి తాజా పరిణామాలను చూస్తుంటే.ఈరోజు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంతో టిడిపి-బిజేపీల సంబంధాలు మరికాస్త బలపడినట్లుగా కనిపిస్తుంది.

 Is It Chandrababu As Nda Convenor-TeluguStop.com

బీజేపీ ఆహ్వానం మేరకుచంద్రబాబు నాయుడు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.బిజేపీ అగ్రనేతలతో కలసిఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమం ముగిసిన అనంతరం బిజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు.

రాష్ట్రంలో, దేశంలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.మోడీతో సమావేశమనంతరం అద్వానీ, రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్ తో విడివిడిగా సమావేశమయ్యారు.

దీంతొ భాజపా తెలుగుదేశం బంధం దాదాపు ఖరారైనట్లే అని స్పష్టమవుతోంది.

అయితే ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమంలో చంద్రబాబుకు కమలనాథులు ఇచ్చిన ప్రియారిటి అంతా ఇంతా కాదు .శివరాజ్ సింగ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో బిజేపి ఇతర మిత్రపక్షాల అధిపతుల కంటే చంద్రబాబుకే కమలనాథులు ప్రాదాన్యతను ఇచ్చారు .వేదికపై మోడి పక్కన చంద్రబాబును కూర్చోబెట్టడాన్ని రాజకీయ వర్గాలు రకరకాలుగా చిత్రీకరిస్తున్నాయి.

మరొకవైపు సెంటిమెంట్ ప్రకారంగా కూడా చంద్రబాబు బీజేపి కి దగ్గరయ్యే సూచనలు ఉన్నాయి .గతంలో ఎన్డీఏ కన్వీనర్ గా చంద్రబాబు ఉన్నప్పుడే బిజేపికి కేంద్రంలో అధికారం దక్కింది.ఆతర్వాత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను ఆపదవిలో కూర్చోబెట్టినప్పటినుంచి ఎన్డీఏ అధికారంలోకి రాలేదు.అందుకే సెంటిమెంట్ పరంగా కూడా బిజేపి ఆలోచిస్తుందని టాక్ .పైగా నితీష్ మోడితో విభేదించడంతో ఎన్డీఏ లో మళ్లీ కన్వీనర్ పోస్ట్ ఖాళీ అయింది, అందుకే ఆ సీటులో మళ్లీ చంద్రబాబును కూర్చోబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రానున్న సాధారణ ఎన్నికల ముందు కానీ.

ఎన్నికల తర్వాత కానీ టిడిపి బిజేపీతో జతకట్టనుంది అనే వార్తల నేపథ్యంలో.ఈ వరుస భేటీలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ఇప్పటికే పొత్తు ఖరారైందని, త్వరలోనే చంద్రబాబును ఎన్డీయే కన్వీనర్ గా కూడా నియమించబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతుండగా ఈ భేటి కీలకంగా మారింది.ఏది ఏమైనా కానీ చంద్రబాబు మాత్రం బిజేపీతో పొత్తుపెట్టుకోవడం ఖాయమని రాజకీయ వర్గాలలో బలంగా మారిపోయింది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube