ఆంధ్రాలో బిజెపికి ఒంటరి పోరే శరణ్యమా ?

జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలానే కనిపిస్తుంది.ముఖ్యంగాఎన్డిఏ లో మిత్రపక్షమైన జనసేన( Janasena ) బిజెపి వ్యవహాశైలి తో విసిగిపోయినట్లే కనిపిస్తుంది, తెలుగుదేశంతో పొత్తుపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయాలు తీసుకోవటం చూస్తుంటే బిజెపితో( BJP ) పొత్తుకు రామ్ రామ్ చెప్పేసినట్టే భావించవచ్చు ,ఎందుకంటే ఒక భాగస్వామ్యపక్షంగా ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవలసిన స్థానే తెలుగుదేశంతో పొత్తును ఏకపక్షంగా జనసేనాని ప్రకటించినప్పుడే బాజాపా తో పొత్తు వికటించే అవకాశం ఉందని చాలామంది అంచనా వేశారు.

 Is It A Lone Battle For Bjp In Andhra , Janasena, Bjp, Telangana Assembly Electi-TeluguStop.com
Telugu Janasena, Varahi Yatra-Telugu Political News

ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లుగా వచ్చిన ప్రకటన చూస్తే ఇక అనఫిషియల్ గా పొత్తు లేనట్లే భావించవచ్చని తెలుస్తుంది.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాల పట్ల ఉదాసీనం గా వ్యవహరించడం, తాము ఇస్తున్న ఫీడ్ బ్యాక్ ను, ఇన్ పుట్స్ ను ఖాతరు చేయకపోవడం వంటివి జనసేనా ని ఈగోను హర్ట్ చేసినట్లుగా తెలుస్తుంది.అంతేకాకుండా వైసిపి( YCP ) నియంతృత్వ పోకడలకు అడ్డుకట్ట వేయకపోవడం, తాను కోరుకున్నవన్నీ కేంద్రంలో వైసిపి చిటికలో చేయించుకోగలడంతో భాజపా ఎవరి వైపు ఉందో ఇట్టే అర్థమయిపోతున్న పరిస్థితుల్లో ఇక తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి పొత్తు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని జనసేన అని ఫిక్స్ అయినట్లే తెలుస్తుంది.

Telugu Janasena, Varahi Yatra-Telugu Political News

తద్వారా తన నిర్ణయం తాను తీసుకొని తెలుగుదేశం జనసేనల పొత్తును దృడం చేయడానికే ఆయన వారాహి యాత్రను( Varahi Yatra ) ఉపయోగించుకుంటున్నారు, ఇక బాజాపా కు మిగిలింది ఒంటరి పోరే అన్నది ప్రస్తుత వినిపిస్తున్న సమాచారం .వైసీపీతో తెరవ వెనక స్నేహం నడిపినప్పటికీ బహిరంగ మద్దతుకు వైసిపి ఒప్పుకోదు ఎందుకంటే బిజెపి వ్యతిరేక వర్గాలకు వర్గాలు వైసిపికి బలంగా అండగా ఉన్నాయి కాబట్టి మరి ప్రస్తుత పరిస్థితుల్లో బిజేపి స్టాండ్ ఏమిటో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయితే గానీ ఒక అంచనాకు రాలేము

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube