కొరటాల శివపై కోపంతో ఆచార్య సినిమాను బలి చేస్తున్నారా..?

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమా ఈనెల 29వ తేదీ విడుదల కానుంది.

 Is Issues Between Warangal Srinu And Dil Raju Negative For Koratala Acharya Movi-TeluguStop.com

ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో పాటు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ నన్ను కూడా జరుపుకుంటుంది.ఇకపోతే గతకొద్దిరోజులుగా నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకుంటున్న విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా నైజాం హక్కులను దిల్ రాజు కాకుండా వరంగల్ శీను సొంతం చేసుకున్నారు.

ఇక దిల్ రాజు, వరంగల్ శీను మధ్య తీవ్రస్థాయిలో వివాదాలు ఉన్న సంగతి మనకు తెలిసిందే ఈ క్రమంలోనే ఆచార్య సినిమా నైజాం హక్కులను గత ఏడాది వరంగల్ శీను అడ్వాన్స్ చెల్లించి సొంతం చేసుకున్నారు.

ఈ విధంగా నైజాం హక్కులను వరంగల్ శీను తీసుకోవడానికి కూడా ఒక బలమైన కారణం ఉంది.కొరటాల శివ దిల్ రాజు మధ్య పరస్పర విభేదాలు ఉండటం వల్ల కొరటాల శివ ఈ సినిమా నైజాం హక్కులను దిల్ రాజుకు కాకుండా వరంగల్ శీను అప్పజెప్పారు.

ఈ క్రమంలోనే వరంగల్ శీను ఆచార్య సినిమా నైజాం హక్కులను 42 కోట్లు చెల్లించి కొనుగోలు చేశారు.

Telugu Acharya, Acharya Nizam, Chiranjeevi, Koratala Shiva, Pooja Hegde, Dil Raj

ఈ విధంగా వరంగల్ శీను భారీ మొత్తంలో ఆచార్య నైజాం హక్కులను కొనుగోలు చేశారు.ఇలా కొనుగోలు చేసిన అనంతరం ఈ సినిమాకు మంచి థియేటర్లు దొరకక పోయినా, అనుకున్న స్థాయిలో థియేటర్లు అందుబాటులో లేకపోయినా ఆచార్య సినిమా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఈ ప్రభావం ఆచార్య సినిమా వసూళ్లపై కూడా పడనుంది.

ఈ క్రమంలోనే కొరటాల శివ, వరంగల్ శీనులతో దిల్ రాజుకు ఉన్న గొడవల కారణంగా ఈ గొడవలు మెగాస్టార్ ఆచార్య సినిమాపై ప్రభావం చూపనున్నాయి ఏది ఏమైనా వీరి గొడవల కారణంగా ఆచార్య సినిమాను బలి చేస్తున్నారని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube