జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న హైపర్ ఆది పలు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ ఉన్నారు.
ఇకపోతే హైపర్ ఆది గత కొన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఇప్పటికీ ఈయన ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో తరచూ హైపర్ ఆది పెళ్లి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.
ఇకపోతే ఇదివరకు జబర్దస్త్ కార్యక్రమంలోనూ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలలో భాగంగా ఈయన ఎన్నోసార్లు పెళ్లి స్కిట్లలో సందడి చేశారు.
ఇలా బుల్లితెర కార్యక్రమాలలో ఎన్నోసార్లు పెళ్ళికొడుకుగా మారిన హైపర్ ఆది నిజ జీవితంలో కూడా పెళ్లికొడుకుగా మారారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈయన పెళ్లి దుస్తులను ధరించి మెడలో దండలు నుదుటిన బాసింగం, పక్కన వధువు కూడా ఉండడంతో ఈ జంట చూడముచ్చటగా ఉంది.
ఇక ఈ ఫోటో వైరల్ కావడంతో ఎంతోమంది హైపర్ ఆది నిజంగానే పెళ్లి చేసుకున్నాడా అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.
అయితే హైపర్ ఆది పెళ్లి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈయన రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు రావడమే కాకుండా మరికొందరు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు.అయితే ఈయన నిజంగా పెళ్లి చేసుకోలేదని గతంలో ఒక సినిమా షూటింగ్ షూటింగ్లో భాగంగా ఈయన ఇలా పెళ్లికొడుకుగా మారడంతో కొందరు ఆ ఫోటోలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.అయితే గత కొద్ది రోజుల క్రితం త్వరలోనే హైపర్ ఆది పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పడంతో నిజంగానే ఆయన పెళ్లి చేసుకున్నారేమోనని భావించారు.
అయితే ఇది నిజ జీవితంలో పెళ్లి కాదని రీల్ జీవితంలో వివాహం అని తెలుస్తుంది.