దేశముదురు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముంబై ముద్దుగుమ్మ హన్సిక ఎంతో అంగరంగ వైభవంగా సోహెల్ కతురియా అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొనున్నారు.వీరి వివాహం రాజస్థాన్ లోని జైపూర్ పురాతన కోటలో ఎంతో ఘనంగా జరగబోతుంది.
ఇక వీరి వివాహం కుటుంబ సభ్యులు పరిమిత సంఖ్యలో బంధుమిత్రులు సన్నిహితుల సమక్షంలో ఈ జంట వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం.ఇక హన్సిక తన ప్రీ వెడ్డింగ్ ఫోటోలను అందుకు సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో పెద్ద ఎత్తున ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.
ఇకపోతే జైపూర్ లోని రాజకోటలో వివాహం అంటే ఎంతోమంది ముఖ్యమైన అతిథులు వివాహానికి హాజరవుతారని చాలామంది భావిస్తారు.ఇక ఈమె సినిమా పరిశ్రమకు చెందినది కావడం అలాగే తనకు కాబోయే భర్త వ్యాపారవేత్త కావడంతో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు వ్యాపారవేత్తలు కూడా వివాహానికి హాజరుకానున్నారని భావిస్తారు.
అయితే ఈమె మాత్రం కొంతమంది సన్నిహితులు బంధుమిత్రులను మాత్రమే వివాహానికి ఆహ్వానించారని అదేవిధంగా వీరి పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణగా కొందరు అతిథులు సందడి చేయబోతున్నారని సమాచారం.
ఈమె తన వివాహానికి పెద్ద పెద్ద సెలబ్రిటీలను ఆహ్వానించకుండా నిరుపేద పిల్లలను తన వివాహానికి ఆహ్వానించిందని తెలుస్తోంది.ఇదివరకే ఈమె పలు ఎన్జీవోలతో కలిసి ఎంతోమంది నిరుపేద చిన్నారులకు సహాయం చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తన వివాహానికి నిరుపేద చిన్నారులను ఆహ్వానించిందని తెలుస్తోంది.
ఇలా హన్సిక తమను కూడా వివాహానికి ఆహ్వానించడంతో చిన్నారులు ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నటువంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇది చూసిన ఎంతో మంది నెటిజన్ లు హన్సిక మంచి మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.