'స్కంద' మూవీ ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో అతనేనా?..చేసి ఉంటే వేరే లెవెల్ ఉండేది

ఊర మాస్ సినిమాలకు పెట్టింది పేరు లాంటోడు బోయపాటి శ్రీను.భద్ర సినిమాతో కెరీర్ ని ప్రారంభించి, ఆ తర్వాత తులసి, సింహా, లెజెండ్, అఖండ , సరైనోడు ఇలా ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొని స్టార్ డైరెక్టర్ గా నిలిచాడు.

 Is He The Star Hero Who Rejected The Movie Skanda If He Did It Would Have Been O-TeluguStop.com

అప్పట్లో బోయపాటి శ్రీను సినిమాల్లో కథ చాలా పవర్ ఫుల్ గా ఉండేది.ఎందుకంటే అప్పట్లో ఆయనతో కొరటాల శివ ఉండేవాడు.

ఆయన అందించే మాటలు మరియు కథలతోనే సినిమాలు తీసేవాడు బోయపాటి శ్రీను.కానీ ఎప్పుడైతే కొరటాల శివ బోయపాటి శ్రీను నుండి బయటకి వచ్చాడో, అప్పటి నుండి బోయపాటి శ్రీను సినిమాల్లో కథ ఉండేది కాదు.

కేవలం మాస్ సన్నివేశాల చుట్టూ స్టోరీ ని రాసుకునేవాడు.వాటితోనే బ్లాక్ బస్టర్ హిట్స్ ని కూడా అందుకున్నాడు.

ఇక ఆయన దర్శకత్వం వహించిన లేటెస్ట్ చిత్రం ‘స్కంద( Skanda )’ నేడు ఘనంగా విడుదలైంది.

Telugu Allu Arjun, Boyapati Srinu, Sarrainodu, Skanda, Sreeleela, Tollywood-Movi

రెగ్యులర్ బోయపాటి మాస్ సినిమాలు ఎలా ఉంటాయో, ఈ సినిమా కూడా అలాగే ఉందంటూ టాక్ వచ్చింది.ఆన్లైన్ బుకింగ్స్ పెద్దగా లేకపోయినా, కౌంటర్ బుకింగ్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి.రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ అదిరిపోయాయి.

ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు 10 కోట్ల రూపాయిలు వచ్చే అవకాశం ఉంది.ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాని బోయపాటి శ్రీను ముందుగా ఒక స్టార్ తో చేద్దాం అనుకున్నాడు అట.ఆ స్టార్ మరెవరో కాదు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ).కానీ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇమేజి వచ్చింది కాబట్టి, ఆ రేంజ్ స్కోప్ ఉన్న కథతో రా, కచ్చితంగా చేద్దాం, ఇప్పుడు ఇలాంటి కథలు వద్దు అని చెప్పాడట.దాంతో ఆ ప్రాజెక్ట్ ని రామ్ తో చేసాడు.పుష్ప చిత్రం తర్వాత వాస్తవానికి ఈ సినిమానే మొదలవ్వాలి.

Telugu Allu Arjun, Boyapati Srinu, Sarrainodu, Skanda, Sreeleela, Tollywood-Movi

గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘సరైనోడు( Sarrainodu )’ అనే చిత్రం వచ్చింది.అప్పట్లో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు.అల్లు అర్జున్ ని మరో లెవెల్ లీగ్ కి తీసుకెళ్లింది.తెలుగు రాష్ట్రాల్లో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది.అప్పటి వరకు కేవలం యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ సినిమాలు చేసిన అల్లు అర్జున్, మొట్టమొదటిసారి పూర్తి స్థాయి మాస్ సినిమా చేసాడు.కేవలం థియేటర్స్ లోనే కాదు, టీవీ టెలికాస్ట్ లో కూడా ఈ చిత్రం సెన్సేషనల్ హిట్.

మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube