Mudragada Padmanabham : ‘ముద్రగడ ‘ అసలు టార్గెట్ ఆయనేనా ? జగన్ అప్పగించిన బాధ్యత అదేనా ? 

కాపు సామాజిక వర్గంలో కీలక నేతగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) వైసీపీ కండువా కప్పుకున్నారు.అప్పటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ గా ముద్రగడ అడుగులు వేస్తున్నారు.

 Is He The Real Target Of Mudragada Padmanabham Is That The Responsibility Assig-TeluguStop.com

  ముఖ్యంగా పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో వైసిపి అభ్యర్థి వంగ గీత( Vanga Geetha )ను  గెలిపించేందుకు , పవన్ ను ఓడించేందుకు ముద్రగడ చేయని ప్రయత్నం లేదు.ఈ నియోజకవర్గంలో తనకున్న పరిచయాలు ఉపయోగించుకుంటూ.

  కాపు నాయకులతో సమావేశం అవుతూ,  వారంతా వైసిపి అభ్యర్థికి మద్దతు ఇచ్చేలా ముద్రగడ రాజకీయం మొదలు పెట్టారు.ఈ మేరకు తన అనుచరులు,  స్నేహితులకు సందేశాలు పంపుతూ,  ఈ విషయంలో తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.

Telugu Alliance, Ap, Jagan, Janasena, Janasenani, Kapu, Pavan Kalyan, Vanga Geet

పిఠాపురం నియోజకవర్గ( Pithapuram Assembly constituency ) వైసీపీ నేతలతో పాటు,  మండలాల వారిగా కాపు ప్రముఖులతోనూ సమావేశం అవుతూ వస్తున్నారు .పిఠాపురంలో కచ్చితంగా ఈసారి వైసీపీ జెండా ఎగురువేయాలనే పట్టుదలతో జగన్ ఉన్నారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండడం, జనసేన, టిడిపి ,బిజెపి కూటమిగా ఏర్పడి తమను ఎదుర్కొనేందుకు వస్తూ ఉండడంతో,  జగన్ సైతం అంతే స్థాయిలో ఈ పార్టీలను ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్నారు .ఈ మేరకు పవన్ ను ఓడిస్తే రాబోయే రోజుల్లో తమకు ఇబ్బందులు ఉండవని లెక్కలు వేసుకుంటున్నారు .

Telugu Alliance, Ap, Jagan, Janasena, Janasenani, Kapu, Pavan Kalyan, Vanga Geet

ఈ బాధ్యత ను ముద్రగడ పద్మనాభంకు జగన్ ( Cm ys jagan )అప్పగించినట్లు సమాచారం.పిఠాపురం నియోజకవర్గంలో మూడు మండలాలు, రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి.పిఠాపురం,  గొల్లప్రోలు ,యూ.కొత్తపల్లి మండలాలు ,పిఠాపురం గొల్లప్రోలు మున్సిపాలిటీలుగా ఉన్నాయి.ఇక్కడ ఉన్న ఓట్లలో వైసీపీకి ఎంతవరకు వస్తాయి అనే విషయాల పైన ఆరా తీస్తున్నారు.2009లో కాంగ్రెస్ తరపున పిఠాపురంలో పోటీ చేసి ఓటమి చెందడం తో అప్పటి పరిస్థితులు,  ఇప్పటి పరిస్థితిలను బేరీజు వేసుకొంటున్నారు.ఈ నియోజకవర్గంలో ఓటర్లను ప్రభావితం చేయగల స్థాయిలో ఉన్న నేతలను గుర్తించి వారితో ముద్రగడ మంతనాలు జరుపుతున్నారు.పూర్తిగా పవన్ ను ఓడించడమే లక్ష్యంగా ముద్రగడ అడుగులు వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube