కోమటిరెడ్డి యూటర్న్ వెనుక అదృశ్య శక్తి ఆయనేనా?

తెలంగాణలో రాజకీయాలు కాక రేపుతున్నాయి.త్రిముఖ పోటీలో రాజకీయ పార్టీలన్నీ ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నాయి.

ప్రస్తుతం మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.దీంతో తెలంగాణలో మరో ఉప ఎన్నిక వస్తుందని జోరుగా ప్రచారం జరగనుంది.

ఒక వేళ ఉపఎన్నిక వస్తే ప్రీ ఫైనల్‌గా పరిగణించాల్సి ఉంటుందని టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ భావిస్తున్నాయి.గతంలో పలు ఉప ఎన్నికల్లో గెలిచినందున మరోసారి తామే గెలుస్తామని బీజేపీ లెక్కలు వేసుకుంటోంది.

అయితే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలో సడెన్‌గా ఎందుకు మార్పు వచ్చింది అన్న విషయం ఆసక్తికరంగా మారింది.ఇటీవల మాణిక్యం ఠాగూర్‌తో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పి ఇప్పుడు ఎందుకు యూటర్న్ తీసుకున్నారో తెలియని పరిస్థితి నెలకొంది.

Advertisement

ఆయన రాజీనామా చేయాలని తీసుకున్న నిర్ణయం వెనుక ఎవరున్నారు అంటూ ఆసక్తికర చర్చ జరుగుతోంది.ఆ కీలక వ్యక్తి ఎవరో కాదు అని.ఆయన సోదరుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని టాక్ నడుస్తోంది.కోమటిరెడ్డి బ్రదర్స్ ఇటీవల పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు.

జిల్లా వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉన్న తమను అధిష్టానం లెక్కలోకి తీసుకోవడం లేదని భావిస్తూ అలకబూనారు.పొన్నాల తర్వాత ఇద్దరు పీసీసీ అధ్యక్షులు వచ్చినా.

ఆ పదవి తమకు ఇవ్వలేదని ఆగ్రహంతో ఉన్నారు.ముఖ్యంగా టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన రేవంత్‌కు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడంపై బహిరంగంగానే అసంతృప్తిని వెళ్లగక్కారు.

అంతేకాకుండా పార్టీకి అంటీముట్టనట్లుగానే ఉంటున్నారు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా త్వరలో అదేబాటలో నడుస్తారని టాక్ నడుస్తోంది.తమ్ముడు ఉప ఎన్నికలో, బీజేపీలో సక్సెస్ అయితే తానూ అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ వైపు వెళ్లడం లేదా తమ్ముడు ఓడిపోతే కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోవాలనే నిర్ణయానికి కోమటిరెడ్డి వెంకట రెడ్డి వచ్చారని కాంగ్రెస్ శ్రేణుల్లోనే చర్చ నడుస్తోంది.రాజగోపాల్‌రెడ్డి పార్టీలోనే ఉండేందుకు ఇప్పటికే రేవంత్, అధిష్టానం పలుమార్లు చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది.

Advertisement

తాజా వార్తలు