ఎన్నో భారీ అంచనాల నడుమ ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 7 ఎంత రసవత్తరం గా సాగుతుందో మన అందరికీ తెలిసిందే.చూస్తూ ఉండే ఈ సీజన్ ఇప్పటి వరకు ప్రసారమైన అన్నీ సీజన్స్ కంటే ది బెస్ట్ గా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.
కంటెస్టెంట్స్ మధ్య పోటీ మరియు బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి.ఈ టాస్కులలో అతి ముఖ్యంగా మారింది ‘పవర్ అస్త్ర’ టాస్క్( Power Astra task ).ప్రారంభం లో నాగార్జున దీని గురించి చెప్పినప్పుడు ఎవరికీ అర్థం కాలేదు కానీ, ఇప్పుడు ఆట ఆడుతున్న సమయం లో మాత్రం ఈ టాస్క్ ఆడే కంటెస్టెంట్స్ కి మాత్రమే కాదు, చూసే ప్రేక్షకులకు కూడా తెగ మజా ఇస్తుంది.ఇప్పటి వరకు పవర్ అస్త్ర ని గెలుచుకున్న ఇంటి సభ్యులు శోభా శెట్టి, సందీప్ మరియు శివాజీ.
ఈ వారం పవర్ అస్త్ర టాస్కులో హోరాహోరీగా ఆడి కంటెండర్లు గా అమర్ దీప్, గౌతమ్, ప్రియాంక, యావర్ మరియు పల్లవి ప్రశాంత్ నిలిచారు.వీరిలో చివరిగా పల్లవి ప్రశాంత్ మరియు యావర్ పోటీ దారులుగా మిగిలినట్టు తెలుస్తుంది.ఈ ఇద్దరి మధ్య జరిగే పోటాపోటీ టాస్కు లో ఎవరు అయితే గెలుస్తారో, వాళ్ళు నాల్గవ వారం పవర్ అస్త్ర టాస్కు ని గెలుపొందిన వారీగా నిలుస్తారు.మరి వీళ్లిద్దరి లో ఎవరు గెలుస్తారో చూడాలి.
సోషల్ మీడియా లో యావర్ కి ఎక్కువ సపోర్ట్ ఉంది.ఎందుకంటే మిగిలిన కంటెస్టెంట్స్ ఆడినా ఆడకపోయినా యావర్( Prince Yawar ) ప్రతీ టాస్కుకి నూటికి నూరు శాతం తన బెస్ట్ ని ఇస్తున్నాడు.
అందుకే అతను గెలవాలని అందరూ అంటున్నారు.మరి ఏమి అవుతుందో చూడాలి.
ప్రశాంత్ మరియు యావర్ ఇద్దరు మంచి స్నేహితులు కాబట్టి, ఇద్దరిలో ఎవరు గెలిచినా సంతోషంగానే ఉంటారు.
ఇక ఈ వారం నామినేషన్స్ ఎంత వాడివేడి వాతావరణం లో జరిగిందో అందరూ చూసారు.వీరిలో రతికా( Rathika Rose ) మరియు తేజా డేంజర్ జోన్ లో ఉన్నారు.వీళ్ళిద్దరిలో ఎవరు ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.
ఒకవేళ రతికా ఈ టాస్కు గెలిచి ఉంటే ఆమె వీకెండ్ లో నామినేషన్స్ నుండి తప్పించుకునేది.కానీ ఆమె గెలవలేదు.
ప్రస్తుతం ఓటింగ్ లైన్ లో అందరికంటే అతి తక్కువ ఓట్లు దక్కించుకున్న కంటెస్టెంట్ రతికానే.చూడాలి మరి ఆమె ఎలిమినేట్ అవుతుందా?, లేదా తేజా ఎలిమినేట్ అవుతాడా అనేది.