మహేష్ త్రివిక్రం మధ్య అసలేం జరుగుతుంది..?

సర్కారు వారి పాట సక్సెస్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ తన నెక్స్ట్ సినిమా త్రివిక్రం డైరక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రాధాకృష్ణ నిర్మిస్తుండగా సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దే నటిస్తుంది.

 Is Differences Between Mahesh Trivikram , Mahesh Babu,trivikram, Pooja Hegde,sar-TeluguStop.com

జూలై నుంచి సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉన్న ఈ సినిమా కథ విషయంలో ఇంకా ఓ క్లారిటీ రాలేదని టాక్.అల వైకుంఠపురములో తర్వాత భీమ్లా నాయక్ కోసం స్క్రిప్ట్ వర్క్ చేసిన త్రివిక్రం ఫుల్ ఫాం లో ఉన్న కారణంగా మహేష్ సినిమాని పూర్తి కథ లేకుండానే సెట్స్ మీదకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారట.

అయితే మహేష్ మాత్రం పర్ఫెక్ట్ ప్లానింగ్ తోనే వెళ్లాలని త్రివిక్రం తో చెబుతున్నారట.ముందు పూర్తి కథ సిద్ధం చేసి దాన్ని ఓకే చేశాకనే మహేష్ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు.

ప్రస్తుతం మహేష్, త్రివిక్రం ల మధ్య ఈ చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది.సర్కారు సక్సెస్ తర్వాత మహేష్ ప్రస్తుతం హాలీడేస్ లో ఉన్నాడు.త్వరలో ఇండియాకు వచ్చి సినిమాని స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు.మరి ఈ సినిమా విషయంలో హీరో డైరక్టర్ మధ్య ఈ డిస్కషన్స్ > ఎప్పుడు ఫైనల్ అవుతాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube