రెండు తెలుగు రాష్ట్రాలలో పట్టు కోసం కాంగ్రెస్ పార్టీ గత కొన్నాళ్లుగా గట్టిగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.ఎట్టకేలకు హస్తం పార్టీ ప్రయత్నాలు ఫలించి తెలంగాణలో అధికారంలోకి వచ్చింది.
ఇక మిగిలింది ఏపీనే.ఇక్కడ కూడా పూర్వ వైభవం పొందాలని కాంగ్రెస్ గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.2014 తరువాత ఏపీలో హస్తం పార్టీ పూర్తిగా కనుమరుగైంది.ఆ తరువాత కాంగ్రెస్ కు చెందిన చాలామంది నేతలు ఇతర పార్టీలలో సెటిల్ అయ్యారు.
ఇప్పుడు హస్తం పార్టీ ఏపీలో పూర్వ వైభవం పొందాలంటే కింది స్థాయి నుంచి పార్టీ బలోపేతం కావాల్సివుంటుంది.మరి ఆ స్థాయిలో పార్టీని బలపరిచే నేత కాంగ్రెస్ లో ఉన్నారా ఎవరు లేరనే చెప్పాలి.
అందుకే కాంగ్రెస్ హైకమాండ్ ఏపీ విషయంలో వైఎస్ షర్మిల( YS Sharmila ) వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.తెలంగాణ వేళ తన పార్టీని కాంగ్రె( Congress )స్ లో విలీనం చేయాలని భావించినప్పటికి.కుదరకపోవడంతో కేవలం మద్దతు వరకే సరిపెట్టుకుంది షర్మిల.అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం షర్మిల విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు వినికిడి.తెలంగాణలో కంటే ఆమె పాత్రను ఏపీలోనే వినియోగించుకోవాలని చూస్తున్నట్లు టాక్.
ఇటీవల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ ఏపీ కాంగ్రెస్ లోకి షర్మిల వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పడంతో కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన ఎలా ఉందో ఇట్టే అర్థమౌతుంది.ఏపీలో మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రచార కర్తగా షర్మిలకు బాద్యతలు అప్పగించే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇకపోతే ఏపీలో ఇకనుంచి అడపాదడపా రాహుల్ గాంధీ ( Rahul Gandhi )మరియు ప్రియాంకాగాంధీ కూడా పర్యటించే ఆలోచనలో ఉన్నారట.ఇలా ఓవరాల్ గా ఏపీ కాంగ్రెస్ కార్యాచరణ అంతా కూడా షర్మిల మీదనే ఉంచేలా అధిష్టానం ముందడుగు వేస్తున్నాట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.
మరి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.ఏపీలో ఎలా పట్టు సాధిస్తుందో చూడాలి.