ఇప్పుడదే కాంగ్రెస్ కు ముప్పు ?

తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది కాంగ్రెస్ లో విన్నింగ్ కాన్ఫిడెన్స్ రెట్టింపు అవుతోంది.ఈసారి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టడం గ్యారెంటీ అని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

 Is Congress A Threat Now, Bhatti Vikramarka , Ts Politics , Komatireddy Venkat R-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఒకవేళ గెలిస్తే ఆ పార్టీలో సి‌ఎం ఎవరేనే దానిపై మూకుమ్మడి రాజకీయాలు జరుఘ్తున్నాయి.ఇటీవల సి‌ఎం పదవి విషయంలో రేవంత్ రెడ్డి( Revanth Reddy ) మాట్లాడుతూ తాను ఎప్పటికైనా సి‌ఎం అవుతానని చెప్పుకొచ్చారు.

అంతే కాకుండా ఆ మద్య ఓ టీవి చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కూడా సి‌ఎం పదవి తానేకే అన్నట్లుగా పరోక్షంగా చెప్పుకొచ్చారు.

Telugu Cm Candi, Congress, Komativenkat, Revanth Reddy, Ts-Politics

అయితే ప్రస్తుతం కాంగ్రెస్ లో సి‌ఎం అభ్యర్థి రేస్ లో చాలమందే ఉన్నారు.అందుకే ఏ ఒక్కరినీ సి‌ఎం అభ్యర్థిగా ఎంపిక చేయడంలో అధిష్టానం తడబడుతున్నట్లు తెలుస్తోంది.అయితే ప్రస్తుతం కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క( Bhatti Vikramarka ) కూడా ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు.

ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని సి‌ఎం అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komatireddy Venkat Reddy ), ఉత్తమ్ కుమార్ రెడ్డి వారు సైతం తాము కూడా సి‌ఎం అభ్యర్థి రేస్ లో ఉన్నామని చెప్పకనే చెబుతున్నారు.

దీంతో ఈ సమస్య ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి పెద్ద సమస్యగా మారింది.

Telugu Cm Candi, Congress, Komativenkat, Revanth Reddy, Ts-Politics

ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అనట్లుగా అసలు ఎన్నికలే జరగలేదు ఫలితాలు వెలువడలేదు అయినప్పటికి సి‌ఎం చైర్ కోసం హస్తం పార్టీలో నానా హైరానా జరుగుతోంది.ఈ సమస్య కీలక నేతల మద్య ఉండడంతో అధిష్టానం కూడా ఆచితూచి అడుగులు వేస్తోంది.అయితే ఈ విషయంలో వీలైనంత త్వరగా క్లారిటీ ఇవ్వకపోతే ఎన్నికల ముందు ఈ సమస్య అధిష్టానానికి మరిన్ని తలనొప్పులు తెచ్చే అవకాశం ఉంది.

మరి ప్రస్తుతం ప్రచారలతో హోరెత్తిస్తున్నా కాంగ్రెస్ పార్టీ.సి‌ఎం అభ్యర్థి విషయంలో ఎప్పుడు క్లారిటీ ఇస్తుందా ? అని అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ప్రస్తుతం పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఎన్నికల తరువాత సి‌ఎం అభ్యర్థి గురించి ఆలోచించాలని అధిష్టానం భావిస్తోందట.మరి ఆ పార్టీ ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube