విభజన హామీలే ఎజెండాగా.హస్తినలో పర్యటిస్తోన్న జగన్.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలతో బేటీ అయ్యారు.అయితే ఇది కేవలం విభజన హామీల కోసం, పెండింగ్ బిల్లుల కోసం మాత్రమే జరిగిన టూర్ లా కనిపించడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే అసలు జగన్ అంతర్మథనం ఏంటి.ఈ టైంలో ఎందుకు హస్తిన బాట పట్టారనేది అంతుపట్టకుండా ఉంది.
అయితే.ఇప్పటి వరకూ బీజేపీ అడిగిన ప్రతీ బిల్లుకు జగన్ తలూపుతూ.
వచ్చారు.అంతేనా రెండు సభల్లోనూ మారు మాట్లాడకుండా మద్దతిచ్చారు.
దేశంలో కాంగ్రెస్ పరిస్థితి కూడా బలహీనంగా ఉండటంతో.ఆప్ పార్టీ విజృంభిస్తోంది.అనతి కాలంలోనే జాతీయ పార్టీ హోదా సాధించింది.దాంతో కేసీఆర్ సైతం స్పీడ్ పెంచి ప్రతి పక్షాలను ఏకం చేసే పనిలో పడ్డారు.
సీఎం జగన్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ కు సాన్నిహిత్యం ఉండటంతో.థర్డ్ ఫ్రంట్ వైపు వెళ్తే.
అది రానున్న ఎన్నికల్లో బీజేపీకి మైనస్ గా మారుతుందని అంచనా వేస్తున్నారు.అందుకే ముందస్తుగా జగన్ ను హస్తిన పిలిపించి.
వచ్చే ఎన్నికల్లో మద్దతు కోసం మాట్లాడినట్టు తెలుస్తోంది.

కేసీఆర్ కు దగ్గరగా ఉంటున్న వారినందరినీ దూరం చేసేందుకు చూస్తున్న కేంద్ర పెద్దలు ఇప్పుడు జగన్ ను సైతం పక్కన ఉంచుకోవాలని చూస్తున్నారు.బీఆర్ఎస్ పార్టీ వల్ల బీజేపీకి వచ్చిన నష్టం లేకపోయినా.ఆయన చేసే రాజకీయం ఆప్ పార్టీకి కలసి వచ్చే అవకాశం ఉంది.
దాంతో అది కాస్తా కుంపటిగా మారితే.బీజేపికి అపార నష్టం వస్తుంది.
జగన్ సైతం అమిత్ షా చెప్పిన దానికి తలూపారని.దాంతో విభజన హామీలతో పాటు, పెండింగ్ బిల్లులు ఇప్పుడు విడుదల అయ్యే అవకాశం ఉంది.
నిజంగా జగన్ కోరిన వాటిలో సగం బీజేపీ చేసినా.జగన్ టూర్ దాదాపు సక్సెస్ అయినట్టే అవుతుంది.







