బోల్డ్ అంటే ఎక్సపోజ్ చెయ్యడమా? అరియనాకు దిమ్మతిరిగే కౌంటర్!

బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ అరియానా.ఈమె గురించి, ఈమె చేసే అల్లర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Is Bold Meant To Expose Arianas Stunning Counter, Bold Meant , Expose, Ariyana-TeluguStop.com

బిగ్ బాస్ షోతో ఎనలేని క్రేజ్ ను సంపాదించుకొని సెలబ్రిటీ హోదాను అందుకుంది.అంతేకాకుండా నాన్ స్టాప్ బిగ్బాస్ లో కూడా పాల్గొని మరింత క్రేజ్ సంపాదించుకుంది.

తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సొంతం చేసుకుంది అరియానా.ఎంతో మంది అభిమానులను సంపాందించుకుంది.

తన కెరీర్ ను మొదటగా యూట్యూబ్ లో యాంకర్ గా మొదలు పెట్టింది.నిజానికి తన కెరీర్ ఇక్కడి నుండే ప్రారంభమమైంది.గతంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేయగా.ఆమెపై వర్మ చేసిన బోల్డ్ కామెంట్లతో సెలబ్రిటీగా మారింది.

ఒక్క ఇంటర్వ్యూతో వర్మ చేతిలో చిక్కిన అరియానా బాగా హాట్ టాపిక్ గా మారి క్రేజ్ సంపాదించుకుంది.

దాంతో వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో అవకాశం అందుకుంది.

ఎంట్రీ తోనే బాగా వైలెంట్ గా నిలిచింది.అంతేకాకుండా హౌస్ లో మరో కంటెస్టెంట్ సోహెల్ తో బద్ధశత్రువుగా ఉండి మరింత రచ్చ చేసింది.

కానీ చివరికి మంచి ఫ్రెండ్స్ గా మారారు.ఇక హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా వీరి మధ్య ఫ్రెండ్ షిప్ మరింత బలపడింది.

ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు బాగా రచ్చ చేశారు.ఇక సోషల్ మీడియాలో ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను కూడా బాగా పంచుకునే వాళ్ళు.ఇక సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ తన ఫాలోవర్స్ తో అప్పుడప్పుడు ముచ్చట్లు కూడా పెడుతుంది ఈ హాట్ బ్యూటీ.

గతంలో పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది.అవి కూడా చాలా వరకు క్లిక్ మనిపించాయి.ఇక ఈ బ్యూటీ కి ఖాళీ సమయం దొరికితే చాలు తన ఫ్రెండ్స్ తో కలిసి బయట తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తుంది.

ఇక ఆ మధ్య కొత్త కారు కొనడంతో అప్పటినుంచి తన కారులో తెగ షికారులు కొడుతూ వాటికి సంబంధించిన వీడియోలను పంచుకుంటూ ఉంటుంది.

ఇక తనకు అషు రెడ్డి తో మంచి ఫ్రెండ్షిప్ బంధం ఉంది.

ఇక వీరిద్దరూ కలిశారు అంటే బాగా రచ్చ రచ్చ చేస్తుంటారు.పైగా వీరిద్దరు చేసే ఓవర్ మాత్రం అంతా ఇంకా కాదు.

ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టా వేదికగా కొన్ని ఫోటోస్ షేర్ చేసుకుంది అరియానా.అందులో తను చాలా ఎక్స్పోజ్ చేస్తూ కనిపించింది.

దీంతో ఆమె ఫోటోలను చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.అయితే అరియానను బోల్ట్ అంటూ ఉంటారు.

దీంతో ఓ నెటిజన్.బోల్ట్ అంటే ఎక్స్పోజ్ చేయడమా అని కౌంటర్ ఇవ్వగా ప్రస్తుతం ఆ కౌంటర్ బాగా వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube