బీజేపీ ' వాట్సాప్ రాజకీయం ' టీఆర్ఎస్ కు ఇబ్బందులే ?

బిజెపి పై పట్టు సాధించేందుకు 2023 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు తెలంగాణ బిజెపి ఇప్పటికే ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తోంది.ఈ మధ్యకాలంలో ప్రజా ఆందోళనలు, ఉద్యమాలు, పాదయాత్రలు ఇలా రకరకాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వం పై జనాల్లో వ్యతిరేకత పెంచే విధంగా తెలంగాణ బిజెపి నాయకులు వ్యవహరిస్తున్నారు.

 Is Bjp S Whatsapp Politics A Problem For Trs., Bjp, Trs, Telangana Politics, Ban-TeluguStop.com

ఇక కేంద్ర బీజేపీ పెద్దలు టిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడంతో పాటు,  కానేక రకాల వేధింపులకు దిగుతున్నారు.ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో మరింతగా టిఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు బిజెపి ప్రయత్నాలు మొదలుపెట్టింది.
  దీనిలో భాగంగానే టెక్నాలజీని బాగా వాడుకుని టిఆర్ఎస్ కు ఇబ్బందులు సృష్టించాలి అనే ఎత్తుగడకు శ్రీకారం చుట్టింది.ఈ మేరకు ‘ వాట్సప్ ‘ ను సమర్థవంతంగా వినియోగించుకునే విషయంపై మరింతగా ఫోకస్ పెట్టింది.

గతంలో బీజేపీ ని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ చాలా విమర్శలు చేశారు.బిజెపి వాట్సాప్ ఫేస్ బుక్ లను నమ్ముకుని రాజకీయాలు చేస్తోందని, దానివల్ల ఉపయోగం ఏమీ లేదని ఎద్దేవా చేశారు.

అయితే దానిని సీరియస్ గా తీసుకున్న బిజెపి నేతలు ఇప్పుడు వాట్సప్ ద్వారానే టిఆర్ఎస్ కు ముచ్చటలు పట్టించేందుకు సిద్ధమవుతున్నారు.ఈ మేరకు తెలంగాణ వ్యాప్తంగా బూత్ ల వారీగా వాట్సాప్ గ్రూపులను రూపొందించి వాటి ద్వారా సమాచారం వేగవంతంగా జనాలకి , పార్టీ శ్రేణులకు వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
 

Telugu Bandi Sanjay, Bjp Whatsapp, Telangana, Trs-Politics

ప్రతి బూత్ నుంచి కనీసం 500 మందిని ఒక గ్రూప్ గా ఏర్పాటు చేసి, ఆ గ్రూపుల్లో ముఖ్యమైన సమాచారం మెరుపు సమ్మెలు ఆందోళనలు, బిజెపి కి సంబంధించిన బ్రోచర్లు, వివిధ రాజకీయ ఎత్తుగడలు వేగంగా అందే విధంగా ప్లాన్ చేసింది.ఈ విధమైన విధానం ద్వారా జనాల్లో పలుకుబడి పెంచుకోవడంతో పాటు, తమ ప్రధాన ప్రత్యర్థి టీఆర్ఎస్ ను ఇరుకుని పెట్టేందుకు ఉపయోగపడుతుందనే లెక్కల్లో తెలంగాణ బీజేపీ నాయకులు ఉన్నారు. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube