పవన్ కోసం ఇప్పుడు టెన్షన్ పడుతున్న బీజేపీ ? 

ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపి అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లారు.దాదాపు రెండు గంటలకు పైగా వీరిద్దరి మధ్య వివిధ రాజకీయ అంశాల గురించి చర్చ జరిగింది.

 Is Bjp Under Tension For Pawan ,pavan Kalyan, Ap, Tdp, Chandrababu, Cbn, Ap Cm J-TeluguStop.com

వైసిపి ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు,  అలాగే కొత్తగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 పైన ఉమ్మడిగా పోరాటం చేసేందుకు,  దానికి సంబంధించిన విషయం పైనే చర్చించేందుకు వెళ్లారని చెబుతున్నా.పొత్తుల అంశం వీరిద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చిందని , 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు ఒక అంగీకారం వచ్చిందని,  సీట్ల పంపకాల విషయమే వీరిద్దరి మధ్య ప్రధానంగా చర్చ సాగినట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే ఇప్పటివరకు ఈ విషయంలో సైలెంట్ గా ఉన్న బిజెపి ఈ విషయంలో చాలా కంగారు పడుతోంది.జనసేన తమతో పొత్తులో ఉన్న,  తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టిడిపి అధినేత చంద్రబాబుతో భేటీ కావడాన్ని జీర్ణించుకోలేకపోతోంది.

2024 ఎన్నికల్లో జనసేన , బీజేపీ కలిసి పోటీ చేస్తాయని గతం నుంచి ప్రకటనలు చేస్తున్న,  దానికి భిన్నంగా పవన్ చంద్రబాబుతో భేటీ కావడాన్ని సీరియస్ గానే తీసుకుంది.అయితే పవన్ ను ప్రస్తుత పరిస్థితుల్లో బెదిరించే కంటే నచ్చచెప్పి తమ దారికి తెచ్చుకోవడం మంచిదనే ఆలోచనతో బిజెపి ఉంది.

అందుకే పవన్ కు సీఎం పదవి ఇస్తామని నేరుగా చెప్పకుండా,  పరోక్షంగా ఆ అంశాన్ని ప్రస్తావిస్తోంది.తమతో కలిసి నడిస్తే సీఎం ను చేస్తామని,  చంద్రబాబుతో కలిసి వెళ్తే ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరు అనే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావీస్తోంది.

ఏపీలో కాపులకు ముఖ్యమంత్రి పదవి రావాల్సి ఉందని,  కానీ పవన్ కళ్యాణ్ టిడిపి తో కలిసి వెళ్తే సీఎం పదవి ఎలా వస్తుందని ఏపీ బీజేపీ నేతలు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు.

Telugu Ap Cm Jagan, Bjp, Central Bjp, Chandrababu, Pavan Kalyan-Political

పవన్ టిడిపి తో కలిసి వెళ్ళినా,  సీఎం ఎవరు అనే ప్రశ్న వస్తుందని,  చంద్రబాబును కాదని పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వరని వారు చెబుతున్నారు.అంతేకాదు 2019 ఎన్నికల్లో టిడిపి పాలనపై ఉన్న వ్యతిరేకతతోనే వైసిపికి ప్రజలు అధికారం కట్టబెట్టారని,  ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నందున టిడిపికి ప్రజలు ఎందుకు ఓట్లు వేస్తారని చెబుతూనే పంజాబ్ లో జరిగిన పరిణామాలను గుర్తు చేస్తున్నారు.పంజాబ్ లో బిజెపి అకాలీదళ్ , కాంగ్రెస్ పార్టీల మధ్య మాత్రమే అధికారం మారుతూ వచ్చింది .అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీలన్నిటిని కాదని ఆమ్ ఆద్మీ పార్టీని అక్కడి ప్రజలు గెలిపించారు.

Telugu Ap Cm Jagan, Bjp, Central Bjp, Chandrababu, Pavan Kalyan-Political

ఏపీలోనూ అటువంటి పరిస్థితిలే ఉన్నాయని , పవన్ కంగారు పడితే లాభం ఉండదని ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు.నేరుగా పవన్ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పకుండానే , పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేస్తూ పవన్ తమ దారికి వచ్చేలా చేసుకుంటున్నారు.టిడిపి కి వీలైనంత దూరంగా పవన్ ఉంచేందుకు బిజెపి నేతలు అష్ట కష్టాలు పడుతున్నారు.

ఈ విషయంలో బిజెపి హై కమాండ్ ఎంత వేగంగా పవన్ ను పిలిపించి నచ్చచెప్పితే అంత మంచిదని,  లేకపోతే పరిస్థితి చేయి దాటిపోయే అవకాశం ఉందని ఏపీ బీజేపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube