'భోళా శంకర్' క్లోసింగ్ వసూళ్లు 'బ్రో ది అవతార్' మొదటి రోజు వసూళ్ల కంటే తక్కువ ఉండబోతున్నాయా..?

మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం భోళా శంకర్( Bhola Shanka ) కి మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే.

ఈ చిత్రం కెరీర్ లో ఒక్కటంటే ఒక్క సరైన హిట్ కూడా లేని మెహర్ రమేష్( Meher Ramesh ) దర్శకత్వం లో తెరకెక్కింది.

ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించారో, ఆరోజు నుండే మెగా ఫ్యాన్స్ లో నీరసం మొదలైంది.సినిమా ఫలితం ఏమిటో ముందే తెలిసిపోయింది.8 ఏళ్ళ క్రితం విడుదలైన తమిళ సినిమాకి రీమేక్ కావడం, దానికి తోడు మెహర్ లాంటి డైరెక్టర్ అవ్వడం తో ఈ చిత్రం పై అంచనాలు మొదటి నుండే లేవు.ఎందుకు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య( Waltair Veerayya ) లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఇలాంటి సినిమా చేస్తున్నాడు అని అభిమానులు బాధపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

ఇక ఈ సినిమా విడుదల అయ్యాక కచ్చితంగా అవమానాలు భరించాల్సిందే అని ముందుగానే ప్రిపేర్ గా ఉన్నారు ఫ్యాన్స్.

సినిమా ఫ్లాప్ అవ్వుధి అని ముందుగానే ఊహించారు కానీ, చిరంజీవి కెరీర్ లోనే ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని రేంజ్ ఫ్లాప్ అవ్వుధి అని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు.ఒక్కసారి ఈ సినిమాకి వచ్చిన వసూళ్లను పరిశీలిస్తే మొదటి రోజు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.కానీ రెండవ రోజు టాక్ ప్రభావం చాలా బలంగా పడింది.

Advertisement

ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రెండవ రోజు కేవలం మూడు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.ఆదివారం రోజు ఇంకా తగ్గే అవకాశం ఉంది.

వీకెండ్ లోనే ఈ స్థాయి వసూళ్లు వస్తే ఫుల్ రన్ లో ఇక ఏ రేంజ్ లో ఉంటుందో అని అభిమానులు కంగారు పడుతున్నారు.ముందస్తు అంచనాల ప్రకారం ఈ చిత్రం క్లోసింగ్ కలెక్షన్స్ 30 కోట్ల రూపాయిల కంటే తక్కువే ఉంటుంది.

రీసెంట్ గా విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో ది అవతార్( Bro the Avatar ) చిత్రానికి మొదటి రోజు 32 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.కానీ భోళా శంకర్ సినిమాకి క్లోసింగ్ లో కూడా అంత మొత్తం వసూళ్లు వచ్చే అవకాశం కనిపించడం లేదు .హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ ని రాబట్టే సత్తా ఉన్న చిరంజీవి లాంటి హీరోకి ఇలాంటి వసూళ్లు రావడం అనేది ఆయన 40 ఏళ్ళ కెరీర్ లో ఎప్పుడూ కూడా జరగలేదు.మళ్లీ ఇలాంటి ఘోరమైన అవమానాలు జరగకుండా ఉండాలంటే రీమేక్ సినిమాలను వెంటనే ఆపేయాలి అని ఫ్యాన్స్ మెగాస్టార్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు.

మరి చిరంజీవి వాళ్ళు కోరుకున్నట్టే చేస్తాడా లేదా అనేది చూడాలి.

మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?
Advertisement

తాజా వార్తలు