కృష్ణంరాజుకు అనుష్క అంటే కోపమా.. ప్రభాస్ తో పెళ్లి జరగనివ్వద్దని అంత పని చేశాడా?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ నటీనటులు అనుష్క, ప్రభాస్( Anushka, Prabhas ) గురించి.వీరి మధ్య ఉన్న స్నేహం గురించి.

 Anushka Angry With Krishnamraj About Marriage With Prabhas Details, Prabhas,anus-TeluguStop.com

కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.టాలీవుడ్ లో వీరిద్దరూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇద్దరు కలిసి పలు సినిమాల్లో కూడా నటించారు.అయితే వీరిద్దరి వ్యక్తిగత విషయాలలో మాత్రం చాలా అనుమానాలు వచ్చాయి.

అంటే ఇద్దరు పెళ్లి చేసుకోకుండా ఇప్పటికి ఒంటరిగానే ఉండటంతో వీరిద్దరిపై బాగా అనుమానాలు వస్తున్నాయి.గతంలో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని పైగా పెళ్లి చేసుకోబోతున్నారని బాగా వార్తలు వినిపించాయి.

అంతే కాకుండా ఈ ప్రశ్నలు వారికి కూడా నేరుగా ఎదురయ్యాయి.దాంతో వారు నవ్వుతూ తమ మధ్య అటువంటివి ఏమీ లేవు అంటూ.

కేవలం స్నేహం మాత్రమే ఉంది అంటూ చెప్పుకొచ్చారు.

Telugu Anushka, Anushkaprebhas, Krishnamraj, Married, Prabhas, Prabhasanushka-Mo

కానీ వారిద్దరి మధ్య స్నేహం చూస్తే మాత్రం అలా ఉండదు.అంటే ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఉంటారు.గతంలో అనుష్క ఓ టీవీ షోలో పాల్గొన్నప్పుడు సినిమాలైనా వదులుకుంటాను కానీ ప్రభాస్ తో ఫ్రెండ్షిప్ ని( Friendship with prabhas ) వదులుకోను అని తెలిపింది.

అంటే ఈ మాటతో చాలామంది అనుష్క ప్రభాస్ ని ఇష్టపడుతుందని అనుకున్నారు.కానీ ఇప్పటివరకు మాత్రం వారిద్దరి మధ్య ఉన్న బంధం ఏంటో క్లియర్ గా తెలియలేదు.

అయితే వీరు పెళ్లి చేసుకోవటం ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుకు( Krishnamraj ) ఇష్టం లేదని ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.ఆ మధ్యనే ఈయన ఈ లోకాన్ని విడిచిపెట్టిన సంగతి తెలిసిందే.

ప్రభాస్ ని గారంగా పెంచిన ఆయన ప్రభాస్ పెళ్లి చూడకుండా ఈ లోకాన్ని వదిలి వెళ్లడంతో ప్రభాస్ అభిమానులు చాలా బాధపడ్డారు.

అయితే గతంలో కృష్ణంరాజు అనుష్కను మాత్రం కోడలుగా వద్దనుకొని వారి పేర్ల మీద ప్రత్యేక పూజలు చేయించాడని.

వారి పెళ్లి కాకూడదు అని కృష్ణంరాజు ఎంతో ప్రయత్నం చేశాడు అని అప్పట్లో కొన్ని వార్తలు వచ్చాయి.అయితే వీరి జాతకాలు అసలు మ్యాచ్ అవ్వలేదని.

ముఖ్యంగా అనుష్క జాతకంలో కుజదోషం ఉందని.ఆ కారణంగానే ప్రభాస్ తో అనుష్క పెళ్లి చేయకూడదు అని గట్టిగా ఫిక్స్ అయ్యాడని తెలిసింది.

అయితే ప్రభాస్ మాత్రం అనుష్కను తప్ప వేరే అమ్మాయిని చేసుకోను అంటూ కృష్ణంరాజుకు గట్టిగా చెప్పేశాడట.

Telugu Anushka, Anushkaprebhas, Krishnamraj, Married, Prabhas, Prabhasanushka-Mo

అందుకే ఆయన బ్రతికి ఉన్నంతవరకు ప్రభాస్ తన పెళ్లి గురించి టాపిక్ తీయలేదు అని తెలుస్తుంది.గతంలో ఓ పూజారి కూడా ప్రభాస్, అనుష్క ల పెళ్లి జరిగితే ప్రభాస్ కి గండం ఉందని అన్నాడని వార్తలు వచ్చాయి.దాంతో కృష్ణంరాజు ప్రభాస్ ఆరోగ్య క్షేమం కోసం ప్రత్యేక పూజలు కూడా చేయిచ్చాడని మరోసారి వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే ప్రభాస్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే.ఇక ఇప్పటికీ కూడా ప్రభాస్ తన పెళ్లి గురించి మాత్రం టాపిక్ తీయట్లేదని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube