Allu Sirish: శిరీష్ విషయంలో అల్లు అరవింద్ తప్పు చేస్తున్నాడా.. అందుకే అలా దూరంగా ఉంటున్నాడా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన అల్లు శిరీష్( Allu Sirish ) గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

వారసత్వంగా అడుగుపెట్టిన శిరీష్ సినీ ఇండస్ట్రీకి తొలిసారిగా బాల నటుడుగా అడుగు పెట్టాడు.

అలా పలు సినిమాలలో నటించగా 2013లో గౌరవం అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు.ఇక ఈ సినిమాలో తన నటనకు మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

ఆ తర్వాత కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు వంటి పలు సినిమాలలో నటించాడు.కానీ అంత సక్సెస్ కాలేకపోయాడు.

పైగా అవకాశాలు కూడా అంతగా అందుకోలేకపోతున్నాడు.అల్లు శిరీష్ నటుడుగానే కాకుండా పత్రిక ఎడిటర్ గా కూడా పని చేశాడు.

Advertisement

అది ఏదో కాదు.సౌత్ స్కోప్ మాసపత్రికలోనే ఎడిటర్ గా చేశాడు.

అంతేకాకుండా గీతా ఆర్ట్స్( Geetha Arts ) సంస్థ కో ప్రొడ్యూసర్ గా కూడా చేశాడు.అల్లు శిరీష్ తండ్రి అల్లు అరవింద్( Allu Aravind ) కూడా నిర్మాత, సినీ నటుడన్న సంగతి అందరికీ తెలిసిందే.

కానీ తన తండ్రి, తన అల్లు అర్జున్ లా ( Allu Arjun ) మాత్రం ఎదగలేకపోతున్నాడు.కానీ శిరీష్ కొన్ని కొన్ని ఫిలిం ఈవెంట్లలో వ్యాఖ్యాతగా కూడా చేశాడు.అయితే ఈ విషయాలన్నీ పక్కకు పెడితే గత కొన్ని రోజుల నుండి అల్లు శిరీష్ ను అల్లు ఫ్యామిలీ పూర్తిగా దూరం పెట్టింది అని జోరుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

తండ్రి అల్లు అరవింద్ అల్లు అర్జున్ ని పట్టించుకున్నంత శిరీష్ ను పట్టించుకోవడంలేదని.అసలు తన విషయంలో ఎటువంటి కేరింగ్ కూడా తీసుకోవటం లేదని వార్తలు వినిపించాయి.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట

పైగా అల్లు శిరీష్ కూడా అల్లు, మెగా కాంపౌండ్ కి సంబంధించిన ఏ ఫంక్షన్లలో కూడా కనిపించడం లేదు.రీసెంట్ గా వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ వేడుకల్లో కూడా కనిపించలేదు శిరీష్.అంతేకాకుండా ఉపాసన కూతుర్ని కూడా చూడటానికి శిరీష్ రాలేదని తెలిసింది.

Advertisement

ఇక ప్రస్తుతం ఇవన్నీ మరోసారి బయటపడటంతో నిజంగానే శిరీష్ కు తన ఫ్యామిలీతో గొడవలు జరిగాయని తెలుస్తుంది.దాంతో అల్లు అరవింద్ శిరీష్ ను ఇంట్లో నుంచి బయటికి పంపించాడని.

దీంతో శిరీష్ ఇప్పుడు ముంబైలో ఉంటున్నాడు అని కొందరు ప్రచారాలు చేస్తున్నారు.

అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇప్పుడైతే ఈ వార్త మరోసారి హాట్ టాపిక్ గా మారుతుంది.ఇక సోషల్ మీడియాలో కూడా మెగా, అల్లు హీరోలు అందరూ కలిసి దిగిన ఫోటోలో అల్లు శిరీష్ లేకపోవటంతో.శిరీష్ ను పూర్తిగా పక్కకు పెట్టేశారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక వీరి మధ్య నిజంగానే గొడవలు జరుగుతున్నాయా.లేక శిరీష్ కెరీర్ కోసం ముంబైలో ఉంటున్నాడా అనేది తెలియదు.

కానీ అటు శిరీష్ ఇటు అరవింద్ కానీ ఈ విషయం గురించి స్పందిస్తే అసలు నిజం ఏంటో అనేది తెలుస్తుంది.ఈ విషయం గురించి వీరు స్పందించే వరకు వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు