రైల్వే ప్రయాణికులకు శుభవార్త... ఇకపై క్షణాల్లోనే పనైపోతుంది!

భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు టికెట్ బుకింగ్ సౌలభ్యాన్ని మరింత మెరుగు పరిచేందుకు కసరత్తులు చేస్తూనే ఉంటుంది.

ట్రైన్ టికెట్ బుకింగ్( Train Ticket Booking ) అనేది చాలా ప్రయాసతో కూడుకున్న విషయం అని అందరికీ తెలిసినదే.

పక్కా ప్లాన్‌తో నెలల ముందు టికెట్ బుక్ చేసుకునే వారికి మాత్రమే టిక్కెట్లు దొరికే పరిస్థితి వుంది.కానీ తత్కాల్‌లోనో, ప్రయాణానికి కొన్ని గంటల ముందో టికెట్ బుక్ చేసుకోవాలంటేనే.

టిక్కెట్ దొరకడం అనేది పూర్తిగా అదృష్టం మీద ఆధారపడాల్సిన పరిస్థితి.

అందుకే ఇలాంటి కష్టాలను అధిగమించడానికి కొన్ని రకాల ప్రణాళికలు రచిస్తూ ఉంటుంది ఇండియన్ రైల్వే( Indian Railway ).అవును, రైలు ప్రయాణికులకు టికెట్ బుక్ చేసుకునే ప్రక్రియను సులభతరం చేసేందుకు ఐఆర్‌సీటీసీ ఇ-వ్యాలెట్( IRCTC E Wallet ) అందిస్తోంది.మంచి డిమాండ్ ఉన్న రోజుల్లో, పండగ సమయాల్లో, వీకెండ్స్‌లో టికెట్ బుకింగ్ సమయాల్లో బ్యాంక్ సర్వర్ మొరాయిస్తుంటుంది.

Advertisement

అలాంటప్పుడు టికెట్ బుక్ అవ్వడం దాదాపు అసాధ్యం.ఇపుడు అలాంటి పరిస్థితికి ఐఆర్‌సీటీసీ ఇ-వ్యాలెట్ దీనికి చెక్ పెడుతుంది.

తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో క్షణాల్లోనే టికెట్ బుక్ చేసుకునేందుకు ఈ ఇ-వ్యాలెట్ ఉపయోగపడుతుంది.ఈ ఇ-వ్యాలెట్‌తో మరొక సౌకర్యం ఏమంటే బుక్ చేసిన టికెట్ క్యాన్సిల్ చేస్తే.మనం కట్టిన డబ్బు తిరిగి వ్యాలెట్‌లో జమ అయిపోతుంది.

ఐఆర్‌‌సీటీసీ ఇ-వ్యాలెట్ కు మూడేళ్ల వ్యాలిడిటీ ఉంటుంది.ఆ తర్వాత కూడా మళ్లీ అకౌంట్ రెనివల్ చేసుకోవచ్చు.

అప్పుడు ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు.ఇక ఇ-వ్యాలెట్ తెరవాలంటే ఐఆర్‌‌సీటీసీ వెబ్‌సైట్‌లో యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

దీనికోసం ఆధార్ కార్డు, పాన్ కార్డు నంబర్ ఎంటర్ చేసి.రిజిస్ట్రేషన్ కోసం రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు