మీరు ఆన్లైన్ గేమ్స్ ఇరగదీస్తారా? 10 లక్షలతో జాబ్ ఆఫర్ ఒకటుంది మరి, చేస్తారా?

అవును, మీరు విన్నది నిజమే.మీరు ఆన్లైన్ గేమ్స్( Online Games ) అదరగొడితే 10 లక్షలతో జాబ్ ఆఫర్ ఒకటుంది.

 Iqoo India Is Looking For Chief Gaming Officer Will Offer Rs10 Lakhs Details, Ne-TeluguStop.com

గేమింగ్ ద్వారా డబ్బు సంపాదించాలనుకునే వారికి ఈ వార్త వర్తిస్తుంది.అందుకని పూర్తిగా చదవండి.

ఇపుడు మీకు iQOO స్మార్ట్ ఫోన్ ( iQOO Smart Phone ) సంస్థ ఓ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది.ఈ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్, మీలాంటి వ్యక్తుల కోసం ఇపుడు జల్లెడ పడుతోంది.

ఈ జాబ్ లో సదరు ఎంప్లాయ్ తన మొబైల్ ఫోన్‌లో గేమింగ్ ఎస్పోర్ట్స్ అనుభవాన్ని కంపెనీకి తెలియ జేయాలి.అంటే ఒక గేమ్ ని వాడినపుడు అతని అనుభవాలు… సో కాల్డ్ గేమ్ యొక్క తీరుతెన్నులు గురించి కంపెనీకి చెప్పాల్సి ఉంటుంది.

తమ అభిరుచిని కెరీర్‌గా మార్చుకునే ఔత్సాహికులకు ఇది మంచి ఉద్యోగమే.గేమింగ్ ఆఫీసర్‌ను నియామకం చేయడం వెనుక ఉన్న వ్యాపార ఎత్తుగడ గురించి మీకు అర్ధం అయిందా? గేమ్‌లు ఎలా ఆడతారు, గేమింగ్ శైలి, దానిని ఎలా ప్రదర్శించారు మరియు గేమ్‌లను ఎలా అర్థం చేసుకోవాలి వంటి అంశాలను కంపెనీలు పరిగణనలోకి తీసుకుంటాయి.ఈ క్రమంలోనే ఇలాంటి నియామకాలు అనేవి జరుగుతున్నాయి.

ఇక ఇక్కడ బహుమతులు కూడా వుంటాయండి.iQOO మొదటి CGOకి రూ.10,00,000 బహుమతిని ప్రకటించింది.గేమింగ్ పరిశ్రమలో యువ ప్రతిభకు మద్దతు ఇవ్వడానికి మరియు ప్రోత్సహించడానికి ఈ సంస్థ కృషి చేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది.భారతీయ గేమర్ ల కోసం కేవలం ఆవిష్కరణలు మరియు థ్రిల్లింగ్ గేమింగ్ అనుభవాలను అందించడమే మా లక్ష్యం అని, సదరు కంపెనీ తెలిపింది.

ఇక యువ గేమర్ లు ఎవరైనా తమ అభిరుచిని వృత్తిగా మార్చుకోవాలనుకునే వారికి ఇదొక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube