డబ్బుల కోసం మాస్టర్ ప్లాన్ వేసిన బిసిసిఐ..!

2008 లో మొట్ట మొదటిసారిగా ప్రారంభమైన ఐపీఎల్ ప్రతీ సంవత్సరం డబ్బులను.ప్రేక్షకులను పెంచుకుంటూ పోతుంది.

 Ipl Media Rights Plans Money , Bcci, Latest News, Viral Latest, Viral , Ipl-TeluguStop.com

ఒకవైపు ఎందరో ఆటగాళ్లకు జీవితాన్ని ఇస్తూ.ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి ఆటగాళ్లు సులభంగా అడుగుపెట్టడానికి ఓ వారిదిగా మారింది.

ఇక మరోవైపు బీసీసీఐ కి కాసుల వర్షం కురిపిస్తుంది.ఇక అందులోనూ ఈ ఏడాది మరి రెండు జట్లు వచ్చి చేరడంతో ఐపీఎల్ వాల్యూ మరింత పెరిగింది.

ఇందులో భాగంగానే రానున్న ఐదేళ్లకు సంబంధించిన మీడియా రైట్స్ ను అమ్మెందుకు బీసీసీఐ ప్లాన్ రెడీ చేసింది.ఈ రైట్స్ ద్వారా దాదాపు రూ.50 వేల కోట్లను రాబట్టాలని ప్లాన్ తో ముందుకు వెళ్తుంది.

ఐదేళ్ల క్రితం ఐపీఎల్ మీడియా రైట్స్ ని స్టార్ స్పోర్ట్స్ కొనుగోలు చేసింది.

గత ఐదేళ్లు నుండి ఇప్పటివరకూ కూడా ఐపీఎల్ మీడియా రైట్స్ స్టార్ స్పోర్ట్స్ దగ్గరే ఉన్నాయి.అయితే రానున్న ఐదేళ్ళలో ఐపీఎల్ మీడియా రైట్స్ ను పెంచాలని బీసీసీఐ ప్లాన్ వేసింది.

ఐపీఎల్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా.ఈసారి మీడియా ప్రసారాలకు సంబంధించి టెలివిజన్, డిజిటల్ హక్కులుగా విభజించారు.

ఇందులో భాగంగానే మీడియా రైట్స్ ను నాలుగు విభాగాలుగా విభజించింది.ఇక మీడియా రైట్స్ ను స్వాధీనం చేసుకోవడానికి డిస్నీ, టీవీ-18 వయాకామ్, సోనీ-జీ, అమెజాన్ ప్రైమ్ మీడియా పోటీ పడుతున్నాయి.

ఇందుకోసం కావాల్సిన పత్రాలను రెడీ చేసుకుంటున్నాయి.మరి ఈ దిగ్గజాలలో ప్రసారం హక్కులు దక్కించుకునేదెవరు.? అనేది తెలియాలంటేమరికొన్ని రోజులు ఆగాల్సిందే.ఈ మీడియా రైట్స్ ద్వారా బీసీసీఐ 50 వేల కోట్ల రూపాయలను ఆర్జించాలని చూస్తుంది.

Telugu Bcci, Latest-Latest News - Telugu

ఇక ఐపీఎల్ ప్రసార హక్కుల ద్వారా వచ్చే ఆదాయం అంతా ఇంతా కాదు.ఓ ప్రముఖ ఆయిల్ సంస్థ ఆరామ్కో సైతం ఐపీఎల్ తో ఒప్పందం (ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ స్పాన్సర్) కుదుర్చుకుందంటే ఈ క్యాష్ రిచ్ లీగ్ విస్తృతి అర్థం చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube