ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో కేంద్రమంత్రులను కలవడంలో బిజీ బిజీగా ఉన్నారు.నిన్న సాయంత్రం నుంచి ఆయన వరుసగా ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు.
ఇవాళ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం జగన్ సమావేశమయ్యారు.రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధిపై గడ్కరీతో సీఎం జగన్ చర్చించినట్లు సమాచారం.
నిన్న ప్రధాని మోడీతో పాటు.కేంద్ర మంత్రులు అమిత్‌షా, నిర్మలా సీతారామన్, గజేంద్రసింగ్ షెకావత్‌లను కలిశారు.
మోడీతో గంటపాటు భేటీ అయ్యారు సీఎం జగన్.త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.
దీనిపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది.
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు సీఎం జగన్.అంతకు ముందు ముఖ్యమంత్రి కేంద్ర ఆర్థిక మంత్రి, కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌తో కూడా సమావేశమై పోలవరం ప్రాజెక్టుపై చర్చించారు.45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన నిర్మాణం, డిజైన్ల ఆమోదంపై చర్చించారు.కాఫర్ డ్యామ్ ఈసీఆర్‌ఎఫ్ డిజైన్‌లను జలశక్తి శాఖ ఇప్పటికే ఆమోదించింది.

మరోవైపు జిల్లాల విభజనపై చర్చించినట్లు సమాచారం.IAS, IPS అధికారుల సంఖ్యను పెంచడం, ఆ మేరకు అధికారుల కేటాయింపుపై మాట్లాడినట్లు సమాచారం.పోలవరం సవరించిన నిధులు, విభజన హామీల అమలుపై మాట్లాడినట్లు తెలుస్తోంది.
జిల్లాల విభజన నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ టూర్‌కు ప్రాధాన్యత ఏర్పడింది.

ఇదిలావుంటే, ఢిల్లీ పర్యటన ముగించుకు ఇవాళ విజయవాడ రానున్న సీఎం జగన్ సాయంత్రం గవర్నర్ విశ్వభూషన్ హరించందన్‌ను కలవనున్నారు.రాజ్‌భవన్ వెళ్లనున్న CM జగన్, కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై చర్చిస్తారు.ఈనెల 11న కొత్త మంత్రివర్గం ప్రమాణం చేయనున్న నేపథ్యంలో ఈ భేటీ ఆసక్తి రేపుతోంది.
ప్రస్తుత మంత్రుల రాజీనామాలు, కొత్త మంత్రుల ప్రమాణస్వీకారంపై గవర్నర్‌కు వివరించనున్నారు సీఎం జగన్.







