ఐపీఎల్‌ 23: ఈ సీజన్లో చివరి వరకు నిలిచే సత్తా వున్న ఐపీఎల్ జట్లు ఇవేనట?

IPL 23: These Are The IPL Teams That Can Last Till The End Of This Season Ipl, Auction, Ipl 2023, Final Teams, Latest News, Viral, Sunrisers Hyderabad ,Gujarat Titans , Mumbai Indians , Sports News, Sports Updates, Matches

ఐపీఎల్‌ 23 (ఇండియన్ ప్రీమియర్ లీగ్)( IPL 2023 ) టైటిల్ కైవసం చేసుకోవడానికి ఈ సంవత్సరం 10 జట్లు తలపడనున్నాయి.మరో వారం రోజుల్లో ఈ లీగ్ ఆరంభం కాగా యావత్ ప్రపంచంలో వున్న క్రికెట్ అభిమానులు అందరూ ఎంతో ఉత్సుకతతో ఈ మ్యాచెస్ కోసం ఎదురు చూస్తున్నారు.

 Ipl 23: These Are The Ipl Teams That Can Last Till The End Of This Season Ipl,-TeluguStop.com

ఈ క్రమంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.మా టీము విజయం సాధిస్తుందంటే.

మా టీమ్ దే విజయం అంటూ యువత పెద్ద ఎత్తున డిబేట్స్ కొనసాగిస్తున్నారు.ఇకపోతే ఈ సీజన్ గెలిచే అవకాశాలు ఉన్న జట్లు ఏవనే విషయంపైనే పెద్ద చర్చలు నడుస్తున్నాయి.

Telugu Final Teams, Gujarat Titans, Ipl, Latest, Matches, Mumbai Indians, Ups-La

ఈ లీగ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు 10 జట్లు సిద్ధమవ్వగా, ప్రధానంగా 4 జట్ల గురించి సర్వత్రా చర్చ నడుస్తోంది.అందులో మొదటిది ‘గుజరాత్ టైటాన్స్.’ ఎటువంటి అంచనాలు లేకుండా గత సంవత్సరం ఐపిఎల్ లో అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ ఏకంగా చాంపియన్ గా అవతరించిందనే విషయం తెలిసినదే.హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి ప్లేయర్ల అదిరిపోయే ఆట తోడవడంతో 2022 సీజన్లో గుజరాత్ టైటాన్స్ ఇరగదీసింది.

దాంతో ఈ సీజన్లో కూడా అది రిపీట్ కాబోతుందని అనుకుంటున్నారు.ఆ తరువాత వినబడుతున్న పేరు ‘ముంబై ఇండియన్స్( Mumbai Indians ) గత సంవత్సరం ఆశించిన స్థాయిలో రాణించని ముంబై ఇండియన్స్ ఈసారి మంచి కసిమీద బరిలో దిగనుంది.

దాంతో అభిమానుల గురి ఈ జట్టుపైన బాగానే ఉన్నట్టు తెలుస్తోంది.

Telugu Final Teams, Gujarat Titans, Ipl, Latest, Matches, Mumbai Indians, Ups-La

ఆ తరువాత బాగా వినబడుతున్న పేరు ‘రాజస్థాన్ రాయల్స్.’ గత సీజన్లో టైటిల్ ని చేజార్చుకున్న రాజస్థాన్ రాయల్స్.ఈసారి ఎలాగన్నా టైటిల్ చేజిక్కించుకునే దిశగా అడుగులు వేయనుంది.

సంజు సాంసన్ సారధ్యంలో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉంది కాబట్టి వీరికి ఎదురే లేదని అంటున్నారు.తరువాత బాగా జనాల నోళ్ళల్లో నానుతున్న పేరు ‘సన్ రైజర్స్ హైదరాబాద్.‘ గత సీజన్లో 8వ స్థానంలో నిలిచిన ఈ జట్టు.ఈ సీజన్ కు పూర్తి మార్పులతో బరిలోకి దిగుతోంది.

మేనేజ్మెంట్ ఈసారి యువ ప్లేయర్ హెడేన్ మార్క్రం కు సారధ్య బాధ్యతలను అప్పగించిన సంగతి తెలిసినదే.దాంతో పెనుమార్పులు సంభవించనున్నాయని తెలుస్తోంది.

అంతేకాకుండా డార్క్ హార్సుగా బరిలోకి దిగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్( Sunrisers Hyderabad ) ఎవరు ఊహించని విధంగా ఐపీఎల్ 16వ సీజన్ టైటిల్ గెలిచే అవకాశం కనిపిస్తోందని కొంతమంది జోష్యం చెబుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube