IPL 23: 16వ సీజన్ రంగం రెడీ అయింది.. కోట్లు కుమ్మరిస్తున్న ఫ్రాంచైజీస్!

IPL (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2023 పండగ వాతావరణం ముందే మొదలయ్యింది.అవును, త్వరలో మినీ వేలం నిర్వహించనున్నారు.

కాగా ఈ మినీ వేలానికి ట్రేడ్ విండో ఓపెన్ అయింది.ట్రేడ్ విండో తెరవడం అంటే ఈ సమయంలో ప్లేయర్‌ను విడుదల చేయడంతో పాటు, జట్లు ఇతర జట్లతో ఆటగాళ్లను జట్టులో చేర్చుకునే ఛాన్స్ ఉంటుంది.

ప్రస్తుత సమాచారం ప్రకారం, ఈ మినీ వేలం తేదీని త్వరలో నిర్ణయించనున్నారు.అదే సమయంలో IPLలోని మొత్తం 10 జట్ల పర్సులు కూడా బాగా పెరిగే అవకాశం కలదు.

ఇకపోతే డిసెంబరు 16న మినీ వేలం నిర్వహించవచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి.తెలిసిన సమాచారం మేరకు ఈ వేలం కోసం అన్ని జట్ల పర్స్ కూడా పెరుగుతుంది.

Advertisement

IPLలోని మొత్తం 10 జట్ల పర్స్‌లో 5 కోట్లు జోడించనున్నారు.ప్రస్తుతం IPL జట్ల గరిష్ట పర్స్ రూ.90 కోట్లు కాగా, త్వరలోనే ఈ పర్స్ రూ.95 కోట్లకు పెరగనుందని సమాచారం.వాస్తవానికి గత ఏడాది BCCI తన బ్లూప్రింట్‌ను రూపొందించింది.అదే సమయంలో, IPL మెగా వేలం 2022లో అన్ని జట్ల పర్స్ రూ.90 కోట్లు, అంటే ఏ జట్టు అయినా గరిష్టంగా రూ.90 కోట్లు ఖర్చు వరకు చేయగలదు.

ఇకపోతే, IPL 24 కోసం పర్స్ పరిమాణం 95 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయలకు పెరుగుతుందని మీడియా నివేదికలు చెబుతున్నాయి.అయితే, ఫ్రాంచైజీకి జీతం పర్స్ పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.ఇది ట్రేడ్-ఇన్ ప్రాతిపదికన ఆధారపడి ఉంటుంది.

అయితే, మినీ వేలంలో అన్ని జట్ల పర్స్ ఏమిటన్నది BCCI వార్షిక సాధారణ సమావేశంలో అంటే AGMలో నిర్ణయించనున్నారు.దీంతో పాటు ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను ఏ వేదికపై నిర్వహించాలనేది కూడా ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు.

ఒలంపిక్ పతకాలలో నిజంగా బంగారం ఉంటుందా..? లేదా..?
Advertisement

తాజా వార్తలు