పంజాబ్ ను చిత్తు చేసి టాప్ పొజిషన్ ను దక్కించుకున్న రాజస్థాన్...

ఇక ఐపీఎల్ 17 సీజన్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్( Rajasthan Royals ) పంజాబ్ కింగ్స్( Punjab Kings ) మధ్య ఒక భారీ మ్యాచ్ అయితే జరిగింది.ఇక ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయాన్ని సాధించింది.

 Ipl 2024 Rajasthan Royals Beat Punjab Kings And Secured The Top Position Details-TeluguStop.com

ఇక దీంతో ఆరు మ్యాచ్ ల్లో రాజస్థాన్ రాయల్స్ 5 మ్యాచ్ లో గెలిచి కేవలం 10 పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుంది.ఇక ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లకు 147 పరుగులు మాత్రమే చేసింది.

ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలర్ లలో అవేశ్ ఖాన్,( Avesh Khan ) మహారాజ్( Maharaj ) ఇద్దరు కూడా తలో 2 వికెట్లు తీసి పంజాబ్ టీమ్ భారీ పరుగులు చేయకుండా కట్టడి చేశారు.ఇక ఈ మ్యాచ్ లో శిఖర్ ధావన్ ప్లేస్ లో సామ్ కరణ్( Sam Curran ) కెప్టెన్సీ చేయడం కూడా ఆ టీం కి కొంతవరకు మైనస్ అయిందనే చెప్పాలి.ఇక పంజాబ్ కింగ్స్ టీమ్ లో ప్లేయర్లు ఎవ్వరూ కూడా ఆశించిన మేరకు రాణించలేదు.దానివల్ల తక్కువ స్కోరుకే పంజాబ్ కింగ్స్ పరిమితమవ్వాల్సి వచ్చింది.ఇక ఇదిలా ఉంటే రాజస్థాన్ ప్లేయర్లు మంచి ఫామ్ లో ఉన్నారు.

కాబట్టి ఆ టీమ్ ను విజయ తీరాలకు చేర్చారు.ఇక రాజస్థాన్ ప్లేయర్లలో యశస్వి జైశ్వాల్( Yashasvi Jaiswal ) 39 పరుగులు చేయగా, రియాన్ పరాగ్( Riyan Parag ) 23 పరుగులు చేశాడు.ఇక చివర్లో హాట్ మేయర్ 10 బంతుల్లో మూడు సిక్స్ లు, ఒక ఫోర్ తో 27 పరుగులు చేయడమే కాకుండా రాజస్థాన్ రాయల్స్ టీం కి ఒక భారీ స్కోరు ను కూడా సాధించి పెట్టాడు.

ఇక దాంతో హాట్ మేయర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు…ఇక రాజస్థాన్ రాయల్స్ టీం ప్లేయర్లు అద్భుతమైన పర్ఫామెన్స్ ని ఇస్తూ ప్రతి మ్యాచ్ లో కీలకపాత్ర వహిస్తూ వస్తున్నారు.కాబట్టి ఈ టీం వరుసగా మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube