షార్ట్ ఫార్మాట్ క్రికెట్ అయిన ఐపీఎల్ లో జరిగే మ్యాచ్ లన్నీ కూడా చాలా ఉత్కంఠగా సాగుతాయి.తక్కువ బంతుల్లో ఎక్కువ స్కోర్ చేయడానికి బ్యాటర్లు బాదే బౌండరీలు బాగా ఆకట్టుకుంటాయి.
ఇక ఈ మ్యాచ్‌ల్లో చేసింజ్ కూడా ఒక థ్రిల్లింగ్ సినిమాని తలపిస్తుందని చెప్పొచ్చు.ఐతే తాజాగా ఐపీఎల్ 2022 మొత్తంలోనే ఒక మోస్ట్ థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది.
అదే ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్.
ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 165 పరుగుల చేయగా.
ఆ లక్ష్య ఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ విఫలమయ్యింది.కానీ చివరి వరకు లక్నో జట్టు చూపించిన పోరాట ప్రతిమ ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంది.
ఈ మ్యాచ్ చూస్తున్నంత సేపు ఒక థ్రిల్లింగ్ మూవీ చూసినంత అనుభూతి కలిగింది.
లక్నో జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 162 స్కోరు సాధించింది.
ఇంకొక నాలుగు పరుగులు చేసినట్లయితే ఇది గెలిచేది.ఈ లక్ష్యఛేదనలో మార్కస్ స్టోయినిస్ 4 సిక్సర్లు, 2 ఫోర్లతో 38 స్కోరు చేసి లక్నో జట్టును విజయపుటంచుల వరకూ తీసుకెళ్లగలిగాడు.

ఇక ఈ ఆటగాడి వల్ల లక్నో గెలుస్తుందని అనుకుంటున్న సమయంలోనే కుల్దీప్ సేన్ అద్భుతమైన బౌలింగ్ చేసి కట్టడి చేశాడు.దీంతో లక్నో టీమ్ ఓడిపోయింది.జట్టు దురదృష్టం కొద్దీ కేఎల్ రాహుల్ ఫస్ట్ బాల్ కే ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.ఇలా 0 పరుగులకే ఇతడు ఔట్ కావడం వల్ల జట్టులో కాన్ఫిడెన్స్ తగ్గి మిగతా వారు కూడా ఔట్ అవుతూ వచ్చారు.
ఏదేమైనా ఈ మ్యాచ్ అభిమానులను బాగా ఎంటర్టైన్ చేసింది.







