రాజులు పోయారు రాజ్యాలు కూడా పోయాయి … కానీ రాజుల మూలాలు రాజవంశీకులు కుటుంబీకులు మాత్రం అలాగే ఉండిపోయారు.ఇలా ప్రస్తుతం ఒకప్పుడు రాజులు కుటుంబాలకు చెందిన వారు ఇక ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ లోనే ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు.
పరిశ్రమలో ఎంతో మంది ఇలా రాజుల కుటుంబాలకు చెందిన వారు హీరోలుగా హీరోయిన్లుగా కొనసాగుతూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. నాటి రాజుల మూలాలను కలిగి ఉండి ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ రాజుల కుటుంబానికి చెందిన వాడే.ప్రభాస్ తండ్రి పేరు ఉప్పలపాటి సూర్య నారాయణ రాజు.
అంతకు ముందు ప్రభాస్ పూర్వీకులు రాజరికపు కలెక్షన్స్ గురించి అభిమానులకు దాదాపుగా తెలుసు.అంతే కాదు ఇప్పటికీ కూడా ఇక రాజుల సంప్రదాయాలను పాటిస్తూ ప్రభాస్ ఆదిత్యం అతిథి మర్యాదలు అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి అని చెప్పాలి.
ప్రభాస్తో కలిసి ఆది పురుష్ అనే సినిమాలో నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ రాజ కుటుంబ మూలాలు ఉన్న వారే కావడం గమనార్హం.పటౌడీ సంస్థానంలో నవాబుల వారసుడిగా సైఫ్ సుపరిచితుడు అని చెప్పాలి.

సైఫ్ అలీ ఖాన్ తండ్రి పేరు మహమ్మద్ మన్సూర్ అలీ ఖాన్ ఈయన ఇంగ్లాండ్ క్రికెట్ టీం లో కూడా ఆడారు.ఇక అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ సైతం హైదరాబాద్లోని నిజాం కుటుంబానికి చెందినదిగా సుపరిచితురాలు.కిరణ్ రావు తాత వనపర్తి రాజా నిజాం సంస్థానంలో జమీందారుగా భూస్వామి గా వెలుగొందారట.కిరణ్ రావ్ కు అతిథి రావు హైదరి దగ్గర బంధువు అవుతారన్నది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
హైదరాబాద్ రాష్ట్ర ప్రధాన మంత్రిగా కొనసాగిస్తారు మహమ్మద్ అక్బర్ నజీర్ అలీ హైదర్ కుటుంబానికి చెందిన వారేనట కిరణ్ రావు అతిధి రావు హైదరి.ఇక మనీషా కొయిరాలా నేపాలి రాజ కుటుంబానికి చెందినది అని చాలామందికి తెలిసిన విషయమే.
మనిషా కొయిరాల తాత విశ్వేశ్వర్ ప్రసాద్ కొయిరాల నేపాల్ ప్రధాన మంత్రిగా పనిచేశారు.ఇర్ఫాన్ ఖాన్ రాజస్థాన్లోని పఠాన్ కుటుంబ మూలాలకు చెందిన వాడట.మైనే ప్యార్ కియా ఫేమ్ భాగ్యశ్రీ మహారాష్ట్రలోని రాయల్ పరివర్తన్ కుటుంబ మూలాలకు చెందిన నటి అన్నది తెలుస్తోంది.