Apple IPhone 16 : ఆన్ లైన్ లో లీక్ అయిన ఐఫోన్ 16 సీరీస్ ఫీచర్లు మామూలుగా లేవుగా..!

ఐఫోన్ 15( Apple iPhone 16 ) లో ఇలాంటి అద్భుతమైన ఫీచర్లు ఉంటాయో దాదాపు అందరికీ తెలిసిందే.అదే ఐఫోన్ 16 అయితే ఫీచర్లు ఇంకెంత మెరుగుగా ఉంటాయో.

 Iphone 16 Series Features Leaked Online Are Not Normal-TeluguStop.com

ఈ ఐ ఫోన్ 16 లాంచ్ అయ్యేందుకు ఇంకొన్ని నెలల సమయం ఉండగానే.తాజాగా ఆన్ లైన్ లో ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్ ఫోన్ డిజైన్ తో పాటు ఫీచర్ వివరాలు లీక్ అయ్యాయి.

అవి ఏమిటో తెలుసుకుందాం.

ఆన్ లైన్ లో లీక్ అయిన సమచారం ప్రకారం.ఐఫోన్16 ప్రో స్మార్ట్ ఫోన్ 6.27 అంగుళాల డిస్ ప్లే, ఐఫోన్16 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ 6.86 అంగుళాల డిస్ ప్లే తో ఉండనుంది.ఐఫోన్15 తో పోలిస్తే ఐఫోన్16 ఫోన్ డిజైన్ మెరుగుగా ఉండే అవకాశం ఉంది.వర్టికల్ కెమెరా లేఅవుట్ తో రానుంది.స్పేషియల్ వీడియో రికార్డింగ్ కు అనుకూలంగా ఉంటుంది.

ఇక ఐఫోన్16, ఐఫోన్16 ప్రో మ్యాక్స్ మోడళ్ల బ్యాటరీ మెరుగైన సామర్థ్యాలతో ఉండే అవకాశం ఉంది.అయితే ఐఫోన్ 16 ప్లస్ బ్యాటరీ సైజు మాత్రం తక్కువగా ఉండే అవకాశం ఉంది.మొత్తానికి ఐఫోన్ 16 సిరీస్ బ్యాటరీ అధునాతన బ్యాటరీ టెక్నాలజీతో ఉండనుంది.ఈ సిరీస్ A18 ప్రో చిప్( A18 Pro chip ) ను కలిగి ఉంటుంది.

ఈ చిప్ స్మార్ట్ ఫోన్ పనితీరును మెరుగు పరుస్తుంది.అంతే కాదు iOS 18లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్( Artificial Intelligence ) ఆధారిత సామర్థ్యాలను ఇంటిగ్రేట్ చేస్తుంది.

అప్గ్రేటెడ్ సిరీస్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెడ్ కంటెంట్ క్రియేషన్ టూల్స్ ను కలిగి ఉంటుంది.వీటితోపాటు ఆపిల్ సంస్థ( Apple company ) ఫోల్డబుల్ ఐఫోన్ లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ ఫోల్డబుల్ ఐఫోన్ ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయని వివరాలు సంస్థ ఇంకా వెల్లడించలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube