కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Minister Komatireddy Venkat Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ల కోసం పని చేస్తానని చెప్పారు.
తని నియోజకవర్గం, తన శాఖ తప్ప తాను వేరే పట్టించుకోవడం లేదని తెలిపారు.చేసిన పాపాలే కేసీఆర్ ను( KCR ) వెంటాడుతున్నాయని పేర్కొన్నారు.
యాదగిరిగుట్ట( Yadagirigutta ) పేరు మార్చడమే మాజీ సీఎం కేసీఆర్ చేసిన మొదటి తప్పు అని చెప్పారు.దేవుడి పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సర్వనాశనం చేశారని విమర్శించారు.
యాదగిరిగుట్ట పనుల్లోనూ స్కాం జరిగిందని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు.దీనిపై పార్లమెంట్ ఎన్నికల తరువాత విచారణ చేయిస్తామని తెలిపారు.అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ అనేది ఏ రాష్ట్రంలోనూ చూడలేదన్నారు.తమ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ బద్నామ్ చేస్తుందన్నారు.గత ప్రభుత్వం ప్రతిమ కంపెనీకి రూ.20వేల కోట్లు దోచిపెట్టిందని ఆరోపించారు.ఈ క్రమంలోనే రేపో మాపో ప్రతిమ శ్రీనివాసరావుపై విచారణ తథ్యమని తెలిపారు.