టీడీపీ అధినేత చంద్రబాబు రెండు పిటిషన్లు ఇవాళ విచారణకు రానున్నాయి.ఈ మేరకు రెండు కీలక పిటిషన్లపై విజయవాడలోని ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.
రెగ్యులర్ బెయిల్ పిటిషన్ తో పాటు సీఐడీ కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టు వాదనలు విననుంది.ఈ క్రమంలోనే చంద్రబాబును ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీఐడీ అధికారులు పిటిషన్ లో పేర్కొన్నారు.
మంగళవారం ఈ పిటిషన్లపై వాదనలు జరిగినప్పటికీ కోర్టు తీర్పును వెలువరించలేదు.ఈ క్రమంలోనే మరోసారి వాదనలు విననున్న ధర్మాసనం తీర్పును వెలువరించనుంది.
మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది.కాగా ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
దీంతో పిటిషన్లపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.







