బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం వెండితెరపై సినిమా అవకాశాలను అందుకుంటు ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి అనసూయ ( Anasuya ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.
ఇలా సోషల్ మీడియా వేదికగా ఈమె తనకు తన సినిమాలకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తన గురించి ఎవరైనా నెగిటివ్ కామెంట్ చేస్తే మాత్రం వారికి తన స్టైల్ లో వార్నింగ్ ఇస్తుంది అన్న విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే యాంకర్ రష్మీ( Rashmi ) ఓ నేటిజన్ మధ్య క్యాస్ట్ గురించి ఒక వివాదం జరిగింది.ఈ క్రమంలోనే రశ్మి సదురు నేటిజన్ కు తన స్టైల్ లో సమాధానం చెప్పింది.అయితే వీరిద్దరి మధ్య క్యాస్ట్ గురించి ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉండగా మరొక నెటిజన్ ఇందులోకి ఇన్వాల్వ్ అవుతూ రష్మీకి ఈ మాత్రం చెప్పే ధైర్యం ఉంది కనీస అనసూయకు ఆ ధైర్యం కూడా లేదు అంటూ ఈమెను గెలికాడు.అయితే ఈ కామెంట్ కాస్త అనసూయ కంటపడటంతో ఒక్కసారిగా రంగమ్మత్త( Rangammatta ) తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా అనసూయ ఈ విషయంపై స్పందిస్తూ తన స్టైల్ కౌంటర్ ఇచ్చారు.హలో మిమ్మల్ని సరి చేయనీయండి.నాకు బాల్స్ లేవు .కానీ అవగాహన ఉన్న అంశాలపై మాట్లాడే ధైర్యం కూడా ఉంది .మనం అంతా కొన్ని అంశాలపై ఎవరి ఆలోచనల వారికి ఉంటాయి.అన్ని ఇష్యులపై స్పందించాలన్న రూల్ లేదు అని.నేను కూడా అనుకోవడం లేదు .ఎవరి పని వాళ్లు చూసుకుంటే మంచిది అంకుల్ అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు.ప్రస్తుతం ఈమె ఇలా బోల్డ్ కామెంట్స్ తో చేసినటువంటి ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.