సూపర్ స్టార్ మహేష్‌బాబు ‘బ్రహ్మోత్సవం’ సినిమా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేయకుండా బ్రేక్‌ల మీద బ్రేక్‌లు తీసుకుంటూ చిత్ర యూనిట్ సభ్యులను ఇరిటేట్ చేస్తున్నాడట.ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు అనధికారికంగా చెబుతున్నారు.
పోయిన నెలలో చాలా రోజుల పాటు బ్రేక్ తీసుకుని ‘బ్రహ్మోత్సవం’ సినిమా షూటింగ్‌ను పక్కకు పెట్టిన మహేష్‌బాబు తాజాగా మరో చిన్న బ్రేక్, చిటికెలో వచ్చేస్తా అంటూ మూడు రోజుల పాటు బ్రేక్ తీసుకున్నాడట.ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న షూటింగ్‌లో మహేష్‌బాబు పాల్గొనడం లేదు.
వ్యక్తిగత కారణాల వల్ల మూడు రోజుల పాటు ‘బ్రహ్మోత్సవం’ సినిమా షూటింగ్‌కు మహేష్‌బాబు హాజరు అవ్వడం లేదని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.మళ్లీ మహేష్‌బాబు ఈనెల 27 నుండి షూటింగ్‌లో పాల్గొంటాడు అని అంటున్నారు.
ఇలా బ్రేక్‌ల మీద బ్రేక్‌లు తీసుకుంటే సినిమా అనుకున్న సమయానికి విడుదల చేయడం కష్టం అని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఫీల్ అవుతున్నాడు.ఇప్పటికే ఈ సినిమా జనవరి నుండి ఏప్రిల్‌కు షిప్ట్ అయిన విషయం తెల్సిందే.
ఈ చిత్రాన్ని ప్రసాద్ వి పొట్లూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.మహేష్‌బాబు సైతం ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు.
భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాలో హీరోయిన్స్‌గా సమంత, కాజల్, ప్రణీతలు నటిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.







