మెగా కోడలుగా ఉపాసన ( Upasana ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఉపాసన మెగా కోడలిగాను రామ్ చరణ్( Ram Charan ) సతీమణిగా అపోలో హాస్పిటల్ వ్యవహారాలన్నింటినీ కూడా ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ ప్రముఖ బిజినెస్ ఉమెన్ గా కూడా పేరు ప్రఖ్యాతలను పొందారు.
ఇలా ఓ గొప్పింటి కోడలు అయినటువంటి ఉపాసన అందుకు తగ్గట్టుగానే ఎంతో హుందాగా వ్యవహరిస్తూ ఉంటారు.ఇక ఈమె ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటూ ఎంతో మందికి సహాయ సహకారాలు చేస్తూ తన మంచి మనసును కూడా చాటుకుంటూ ఉన్నారు.

ఈ విధంగా ఉపాసన ఎన్నో మంచి పనులను చేస్తూ మెగా కుటుంబ పరువు ప్రతిష్టలను కాపాడుతున్నారు అనే సంగతి మనకు తెలిసిందే.ఏ మాత్రం సినీ బ్యాక్ గ్రౌండ్ లేని కుటుంబం నుంచి ఉపాసన మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టారు.ఇకపోతే తాజాగా ఉపాసనకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఉపాసనకు కూడా ఇండస్ట్రీలో ఫేవరెట్ హీరోలు అలాగే నచ్చని హీరోలు ఉన్నారు అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది.
ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక హీరో అంటే ఏమాత్రం నచ్చరని కనీసం ఆయనను చూస్తే తనతో మాట్లాడటానికి కూడా ఇష్టపడరని తెలుస్తుంది.

మరి ఉపాసనకు నచ్చని ఆ టాలీ వుడ్ హీరో ఎవరు అనే విషయానికి వస్తే ఆ హీరో మరెవరో కాదు టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని ( Akhil Akkineni ) అంటే ఉపాసనకు ఏమాత్రం ఇష్టం లేదని తెలుస్తుంది.అఖిల్ ను చూడగానే కనీసం తనతో మాట్లాడటానికి కూడా ఈమె ఇష్టపడరట అయితే అఖిల్ అంటే ఉపాసనకు ఇంత కోపం ఉండటానికి కారణం లేకపోలేదు.ఉపాసన తన కజిన్ సిస్టర్ అయిన శ్రేయ భూపాల్ ను అఖిల్ ప్రేమించి పెళ్లి చేసుకోవాలని భావించారు.
వీరిద్దరూ నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు అయితే కొన్ని కారణాలవల్ల ఈ పెళ్లి ఆగిపోవడంతో అఖిల్ కారణంగానే పెళ్లి ఆగిపోయిందన్న ఉద్దేశంతోనే ఉపాసన కోపంగా ఉన్నారని, తనతో మాట్లాడటానికి కూడా ఇష్టపడరని తెలుస్తుంది.







