సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి తమన్న ( Thamannah ) ఒకరు.ఈమె ఒకానొక సమయంలో సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గారు తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక ఇటీవల కాలంలో తమన్నా సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇక తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ( Vijay Varma ) తో ప్రేమలో పడిన విషయం తెలిసిందే.
వీరిద్దరు కలిసి లస్ట్ స్టోరీస్2( Lust Stories 2 ) సిరీస్ లో నటించారు.ఈ సిరీస్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ మొదలైందని, వారి ప్రేమ విషయాన్ని బహిరంగంగా తెలియజేస్తూ ఇద్దరు చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు.సాధారణంగా తమన్న చాలా ప్రశాంతంగా ఉంటారు.ఈమె ఎప్పుడు కూడా మీడియా పైన లేదంటే ఇతరుల పైన ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు కూడా లేవు.అయితే ఈమెకు కనుక కోపం వస్తే తన చుట్టుపక్కల వాళ్ళు చాలా భయపడిపోతారని తెలుస్తుంది.
సాధారణంగా ఎవరిపైనైనా కోపం వస్తే మనం వారిని అరుస్తూ ఉంటాము కానీ తమన్నా మాత్రం అలా చేయదట కోపం వస్తే ఏకంగా తన గదికి వెళ్లి డోర్స్ వేసుకొని ఒంటరిగా కూర్చుంటుందట.ఎవరు ఎంత పిలిచిన పలకదు.ఇక తన కోపం చల్లారిన తర్వాత చల్ల నీటితో షవర్ చేసి బయటకు వస్తారని అనంతరం తన సమస్య ఏంటి తాను ఎందుకు అలా ఉందనే విషయాలను తన వారితో షేర్ చేసుకుంటారని తెలుస్తుంది.
ఇలా తమన్నాకి ఉన్నటువంటి ఈ అలవాటు తెలిసిన వారందరూ ఇదే అలవాటు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.