టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్క్ బ్యూటీగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి తమన్న ( Tamannaah ) ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు దశాబ్దన్నర కాలం పూర్తి అవుతున్నప్పటికీ ఈమె ఇంకా వరుస సినిమా అవకాశాలను అందుకుంటు కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా నటిగా పలు సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తూ ఎంతో సందడి చేస్తున్నటువంటి తమన్న బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ( Vijay Varma ) తో ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే.
ఇలా వృత్తిపరమైన జీవితంలోనూ వ్యక్తిగత జీవితంలోను తమన్న ఎంతో సంతోషంగా ఉన్నారు.

ఇకపోతే ఇన్నేళ్ల సినీ కెరియర్లో తమన్న ఏమాత్రం అవకాశాలను కోల్పోకుండా వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు అయితే కెరియర్ లో ఇంత సక్సెస్ అందుకోవడానికి కారణం ఆమెకు ఉన్నటువంటి ఒక చెడు అలవాటే( Tamannaah Bad Habit ) అని తెలుస్తుంది.చిన్నప్పటినుంచి తమన్నాను ఎవరైనా ఏదైనా ఇది నువ్వు చేయలేవు అంటే ఆ పని చేసి చూపించడం ఆమె నైజం.ఇలా తనకు ఏది సాధ్యం కానిది లేదనే భావన కలిగి ఉండే తమన్న ఏ పనినైనా ఎంతో అవలీలుగా చేస్తారట.
చిన్నప్పటినుంచి ఇదే అలవాటుగా ఉన్నటువంటి ఈమెకు సినిమా ఇండస్ట్రీలో బాగా కలిసి వచ్చిందని తెలుస్తుంది.

ఇండస్ట్రీలో కొనసాగే సమయంలో ఇలాంటి స్టెప్ తమన్నా చేయలేదు అంటే తప్పనిసరిగా ఆ స్టెప్ నేర్చుకొని చూపించే వారట యాక్షన్ సన్ని వేషాలు అయితేనేమి రొమాంటిక్ సన్నివేశాలు( Romantic Scenes ) అయితే నేమి తనకు సాధ్యపడదని ఎవరైనా అంటే వాటిని ఛాలెంజ్ గా తీసుకొని మరి చేసి తానేంటో నిరూపించుకునే వారట ఇలా ఈ అలవాటు కారణంగానే ఈమె ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైనటువంటి పాత్రలలో నటించి మంచి సక్సెస్ సాధించారని తెలుస్తోంది.ఇకపోతే తాజాగా తమన్నా రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్( Jailer Movie ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.







