టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం హనుమాన్(Hanuman) ఈ సినిమా అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకునే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.దీంతో చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్లలో పాల్గొని సందడి చేస్తున్నారు.
ఇకపోతే తాజాగా ప్రశాంత్ వర్మ(Prashanth Varma) హీరో తేజ సజ్జ(Teja Sajja) ఇద్దరు కూడా మంచు మనోజ్(Manchu Manoj) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి ఉస్తాద్(Ustaad) కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా బాలయ్యతో సినిమా చేయడం గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.ప్రశాంత్ వర్మ ఇప్పటికే తన వద్ద 10 సూపర్ హీరోల కథలు ఉన్నాయని తెలియజేసిన సంగతి తెలిసిందే.ఇక ఈయన ఇదివరకు బాలకృష్ణ సినిమాలకు దర్శకుడిగా కాకపోయినా ఆయనతో కలిసి పని చేశారు.
దీంతో బాలయ్య ( Balakrishna ) మీకు చాలా క్లోజ్ కదా ఆయనతో మీరు నరసింహస్వామి అవతారంలో( Narasimha Swamy Avatar ) సూపర్ హీరో మూవీ చేసావంటే ఉంటుంది నా సామి రంగ అంటూ మనోజ్ కామెంట్స్ చేశారు.
ఈ విధంగా మనోజ్ చెప్పినట్టే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో బాలకృష్ణ నరసింహస్వామి అవతారంలో ఒక సినిమాని కనుక చేస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు మొత్తం చిరిగిపోతాయని బాలయ్య ఈ సినిమాతో సరికొత్త రికార్డులు సృష్టిస్తారు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.మరి ప్రశాంత్ వర్మ బాలయ్యతో ఏ తరహా సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఏంటి అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు కానీ మనోజ్ చెప్పినట్టు ఇదే కనుక నిజమైతే ఇండస్ట్రీలో ఒక్క ముక్క రికార్డ్స్ ఏవి కూడా మిగలవని అభిమానులు భావిస్తున్నారు.