Balakrishna Bobby : రాజకీయాలను టచ్ చేయబోతున్న బాలయ్య.. ఆ సినిమాతో చరిత్ర తిరగరాస్తారా?

టాలీవుడ్ ప్రేక్షకులకు నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ( Balakrishna ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలయ్య బాబు ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.

 Interesting News On Balakrishna And Bobbys Movie-TeluguStop.com

కాగా ఈ ఏడాది ఆరంభంలో సంక్రాతి పండుగకు వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన బాలయ్య బాబు ప్రస్తుతం తదుపరి సినిమా భగవత్ కేసరి సినిమా షూటింగ్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొంటున్నారు.

Telugu Ap, Balakrishna, Bobby, Tollywood-Movie

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియా( Social media )లో బాలయ్య బాబుకి సంబంధించి ఒక వార్త చెక్కలు కొడుతోంది.కాగా త్వరలో బాలకృష్ణ, బాబీ కాంబినేషన్‌లో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.అయితే, తాజాగా ఈ సినిమా గురించి మరో అప్ డేట్ వినిపిస్తోంది.ఈ సినిమా బాలయ్య టైప్ ఫక్తు యాక్షన్ డ్రామా కాదని, ఇదొక ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో సాగే ఎమోషనల్ డ్రామా అని తెలుస్తోంది.

ఈ సినిమాలో యాక్షన్ కన్నా ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయట.పైగా బాలయ్య క్యారెక్టర్ కూడా చాలా కొత్తగా ఉంటుందని తెలు స్తోంది.అలాగే ఇందులో పాలిటిక్స్ నేపథ్యంలో కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట.

Telugu Ap, Balakrishna, Bobby, Tollywood-Movie

డైరెక్టర్ బాబీ( Director Bobby ) ఈ సినిమా కథలో పొలిటికల్ టచ్ కూడా ఇచ్చాడట.ఏది ఏమైనా రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా వస్తే మాత్రం ఈ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి.ఇక ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్‌‌ లో కనిపించబోతున్నాడు.

ముఖ్యంగా సినిమాలో బాలయ్య ఓల్డ్ గెటప్ ఒక రేంజ్ లో ఉంటుందని టాక్.మామూలుగానే ఈ మధ్యకాలంలో బాలయ్య బాబు నటించిన చాలా సినిమాలలో ఏపీ ప్రభుత్వంని ఉద్దేశించి డైలాగులు ఉంటున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

అలాంటిది ఏకంగా పొలిటికల్ టచ్ అంటే మాత్రం ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టే అంటున్నారు అభిమానులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube